ఏపీలో ఘన వ్యర్ధాల నిర్వహణపై ఎన్జీటీలో ముగిసిన విచారణ


ఢిల్లీ: ఏపీలో ఘన వ్యర్ధాల నిర్వహణపై ఎన్జీటీలో విచారణ ముగిసింది. ఈ విచారణకు ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం హాజరయ్యారు. సీఎస్‌కు జస్టిస్‌ గోయల్‌ ధర్మాసనం కీలక సూచనలు చేసింది. వాతావరణ కాలుష్యం పెను ముప్పుగా మారుతుందని, నివారణ చర్యలు తీవ్రతరం చేయాలని సీఎస్‌కు ఎన్జీటీ సూచించింది. అన్ని విభాగాలలో కాలుష్య నివారణకు చర్యలు చేపట్టామని సీఎస్‌ విచారణలో తెలిపారు. ఇసుక అక్రమ తవ్వకాలు, అక్రమ కట్టడాలతో పర్యావరణ కాలుష్యం ఎక్కువగా ఏర్పడుతోందని ఎన్జీటీ ఆందోళన వ్యక్తం చేసింది. అమరావతిలో కృష్ణానది పరిరక్షణ కోసం చర్యలు తీసుకోవాలని, 6 నెలల్లో ఘన వ్యర్థాల నిర్వహణ చేరుకోవాలని ఎన్జీటీ ఆదేశించింది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *