ఏపీ ఎగ్జిట్‌పోల్ ఫలితాలను లగడపాటి ఎప్పుడు విడుదల చేస్తారంటే..


హైదరాబాద్: అమెరికాలోని కాలిఫోర్నియా రాష్టంలో ఎన్నారై టీడీపీ మీట్ & గ్రీట్ కార్యక్రమం వైభవంగా జరిగింది. మిల్ పిటాస్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధి కోమటి జయరాం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా టీడీపీ జాతీయ మీడియా కమిటీ కన్వీనర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ ఎల్.వి.ఎస్.ఆర్.కె. ప్రసాద్, విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ హాజరయ్యారు.
 
వాళ్లకే ప్రజలు పట్టం కడతారు!
ఈ కార్యక్రమంలో లగడపాటి మాట్లాడుతూ.. మే 19న ఎగ్జిట్‌పోల్‌ ఫలితాలు వెల్లడిస్తానని స్పష్టం చేశారు. ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి ఎవరు చేస్తారో వారికే ప్రజలు పట్టం కడతారన్నారు. తెలంగాణలో తన సర్వే ఎందుకు విఫలమైందో ఏపీ ఎగ్జిట్ ఫలితాలు వెల్లడించిన రోజే చెబుతానన్నారు. కాగా.. తెలంగాణలో మహాకూటమి గెలుస్తుందని చెప్పిన లగడపాటి సర్వే అట్టర్ ప్లాప్ అయిన విషయం విదితమే.
 
మళ్లీ చంద్రబాబే సీఎం..!
ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ.. ఈసారి కూడా అసెంబ్లీ ఎన్నికల్లో 130 సీట్లకు పైగా గెలిచి నారా చంద్రబాబు అధికారం చేపడతారని ప్రసాద్ జోస్యం చెప్పారు. రాష్టంలో చంద్రబాబు చేసిన అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రజలంతా సంతోషంగా ఉన్నారన్నారు. గత ఐదేళ్లలో భారతదేశంలోని ఏ రాష్టంలో జరగని అభివృద్ధి.. ఒక్క ఆంద్రప్రదేశ్‌లోనే జరిగిందని పేర్కొన్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *