ఏపీ రాష్ట్రంలో మండుతున్న ఎండలు


అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. మంగళవారం కూడా 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఆర్టీజీఎస్‌ పేర్కొంది. ఇవాళ ఉదయం 11 గంటలకే 170 మండలాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయినట్లు చెప్పింది. 9 మండలాల్లో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయిందని, ఈ నెల 10 వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశ ఉందని ఆర్టీజీఎస్‌ తెలిపింది. ప్రజలు మూడు రోజుల పాటు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసర పనులు ఉంటే తప్ప బయటకు రావొద్దని సూచించింది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *