ఐఎస్‌ అధినేత అబూ బకర్‌ బతికే ఉన్నాడు!


డమాస్కస్‌, ఏప్రిల్‌ 29: ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకడు అబూ బకర్‌ అల్‌ బాగ్దాదీ బతికే ఉన్నాడు. అతడు మాట్లాడుతున్న వీడియోను ఐఎస్‌ మీడియా గ్రూప్‌ అల్‌ ఫర్కాన్‌ సోమవారం రాత్రి విడుదల చేసింది. 2014 జులైలో చివరిసారిగా ఓ వీడియో ద్వారా ప్రపంచానికి కనిపించిన అబూ బకర్‌, 2015 మార్చి 18న సిరియా సరిహద్దు రాష్ట్రం నినెవే వద్ద తీవ్రంగా గాయపడ్డట్లు వార్తలు వెలువడ్డాయి. అతడు చనిపోయినట్లు వచ్చిన వార్తల్ని అమెరికా, రష్యా రెండూ ధ్రువీకరించాయి. కానీ ఇరాకీ టెలివిజన్‌ మాత్రం బకర్‌ బతికే ఉన్నట్లు చెబుతూ వస్తోంది. తాజా వీడియోను సీఎన్‌ఎన్‌, బీబీసీలు పూర్తిగా నమ్మడంలేదు. ఆ వీడియో ఎప్పటిదో ఐఎస్‌ వెల్లడించలేదని అంటూ తమ అనుమానాల్ని ప్రకటించాయి. అల్‌ జజీరా ఛానెల్‌ మాత్రం ఇది తాజా వీడియోయేనని, ముఖకవళికలు, నెరిసిన గడ్డం, మాటతీరును బట్టి అదే స్పష్టమవుతోందని వెల్లడించింది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *