ఐదు పెట్రోలు బంకులపై కేసులు


అమరావతి, ఏప్రిల్‌ 22(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా తూనికలు, కొలతల శాఖ సోమవారం ఐదు పెట్రోలు బంకులపై కేసులు నమోదు చేసింది. ఎస్సార్‌, రిలయన్స్‌ బంకుల్లో ఐదుచోట్ల డీజిల్‌, పెట్రోల్‌ కొలతల్లో తేడాలున్నట్లు వెల్లడైందని ఆ శాఖ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది. 13 జిల్లాలకు సంబంధించి విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, భీమవరం, నల్లజెర్ల, కాకినాడ, రాజమండ్రి, చేబ్రోలు, విజయవాడ, అమరావతి, బాపట్ల, ఏర్పేడు, కమలాపురం, అనంతపురం, ఎమ్మిగనూరు, ఒంగోలు తదితర ప్రాంతాల్లోని 52 బంకుల్లో ఆకస్మిక సోదాలు చేపట్టినట్లు తూనికలు, కొలతల శాఖ ఉన్నతాధికారులు వివరించారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *