ఐదోదశ పోలింగ్‌లో అత్యంత ధనవంతుడైన అభ్యర్థి ఎవరంటే..


న్యూఢిల్లీ : ఐదో దశ పోలింగ్‌లో జార్ఖండ్ నుంచి బరిలో నిలిచిన అభ్యర్థుల్లో అత్యంత ధనవంతుడు ఏ పార్టీ అభ్యర్థో తెలుసా? హజారియా బాగ్ నుంచి పోటీ చేస్తోన్న అధికార బీజేపీ ఎంపీ జయంత్ సిన్హా. జార్ఖండ్‌ నుంచి నిలబడ్డ అభ్యర్థుల్లో అత్యంత ధనవంతుడని, ఆ మాటకొస్తే మొత్తం దేశంలోనే మూడో స్థానంలో నిలబడ్డారని అసోసియేషన్ ఫర్ డెమోక్రెటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సంస్థ వెల్లడించింది. నామినేషన్ సందర్భంగా ఆయన పేర్కొన్న అఫిడవిట్‌లో మొత్తం ఆస్తుల విలువ 77.07 కోట్లని ఆ సంస్థ తేల్చింది. ఐదో దశలో జరగబోయే పోలింగ్‌లో మొత్తం 51 పార్లమెంట్ స్థనాల్లో 674 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మరోవైపు సినీ నటుడు, కాంగ్రెస్ నేత శతృఘ్న సిన్హా భార్య పూనమ్ 193.54 కోట్లతో దేశంలోనే అత్యంత ధనవంతమైన అభ్యర్థిగా ఐదో దశ పోలింగ్‌లో స్థానం సంపాదించుకున్నారు.
 
జార్ఖండ్‌లోని మొత్తం 61 మంది ఎంపీ అభ్యర్థుల్లో 14 మంది కోట్లకు పడగలెత్తిన అభ్యర్థులేనని, 13 మంది నేర చరితులని ఏడీఆర్ సంస్థ తన అధ్యయనంలో వెల్లడించింది. జార్ఖండ్‌లోని మొత్తం నాలుగు ఎంపీ నియోజకవర్గాల్లోని నలుగురు అభ్యర్థులూ కోట్లకు పడగలెత్తిన వారేనని, ఆ జాబితాలో సంజయ్ సేథ్, అర్జున్ ముండా, అన్నపూర్ణా దేవి, జయంత్ సిన్హా ఉన్నారని ఏడీఆర్ సంస్థ విశ్లేషించింది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *