ఒక్కో నియోజకవర్గానికి 50 మంది న్యాయవాదులను నియమించిన డీఎంకే


తమిళనాడు : రాష్ట్రంలో జరగబోయే ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా క్షేత్ర స్థాయిలో డీఎంకే అభ్యర్థులకు ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా డీఎంకే చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఆ జాగ్రత్త ఎంత వరకు వెళ్లిందంటే ఉప ఎన్నికలు జరగబోయే ఒక్కో నియోజకవర్గానికి ఏకంగా 50 మంది న్యాయవాదులను నియమించారు. ఇలా నాలుగు స్థానాల్లో జరిగే ఉప ఎన్నికల్లో ఏకంగా 200 మంది న్యాయవాదులను డీఎంకే బరిలోకి దింపింది. ప్రచారంలో భాగంగా కార్యకర్తలకు గానీ, అభ్యర్థులకు గానీ అనుకోకుండా ఏవైనా న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తితే ముందు జాగ్రత్త చర్యలో భాగంగా అన్ని పార్టీలూ ఇదే విధానాన్ని అవలంబిస్తుంటాయి. డీఎంకే సైతం ఇదే విధానాన్ని అవలంబించినా ఇంత పెద్ద సంఖ్యలో న్యాయవాదులను నియమించడంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
 
ఏదైనా నియోజకవర్గంలో సభలు, ర్యాలీల అనుమతి కోసం ఏవైనా అడ్డంకులు వస్తే వాటిని ఎలా పరిష్కరించుకోవాలి, అంతేకాకుండా చిన్న చిన్న న్యాయపరమైన చిక్కులు వచ్చినపుడు వాటిని ఎలా పరిష్కరించుకోవాలన్నది డీఎంకే అభ్యర్థులకు వీరు సలహాలు ఇస్తుంటారు. దీనంతటినీ చూస్తుంటే నాలుగు స్థానాల ఉప ఎన్నికలను డీఎంకే ఎంత సీరియస్‌గా తీసుకుంటుందనే అంశాన్ని గమనించవచ్చు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *