ఒడిసాలో ఎన్నికల కోడ్‌ ఎత్తివేత


న్యూఢిల్లీ, మే 1: తుఫాన్‌ వల్ల కలిగే నష్టాన్ని తగ్గించేందుకు, చురుగ్గా సహాయ, పునరావాస కార్యక్రమాలు చేపట్టేందుకు వీలుగా కోస్తా ప్రాంత జిల్లాల్లో ఎన్నికల కోడ్‌ను ఎత్తివేయాలని ఒడిసా సీఎం నవీన్‌ పట్నాయక్‌ చేసిన విజ్ఞప్తికి కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) సానుకూలంగా స్పందించింది. పూరి, జగత్‌సింగ్‌పూర్‌, కేంద్రపారా, భద్రక్‌, బాలాసోర్‌, మయూర్‌భంజ్‌, గజపతి, గంజాం, ఖోర్దా, కటక్‌, జాజ్‌పూర్‌ జిల్లాల్లో ఎన్నికల కోడ్‌ను ఎత్తివేసింది. పాత్‌కుర అసెంబ్లీ స్థానానికి మే 19న జరగాల్సిన ఎన్నికను కూడా వాయిదా వేయాలని ఈసీని ఆయన కోరారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *