ఒత్తిడిలో కూడా ఎన్నికలు సజావుగా నిర్వహించాం: బొప్పరాజు


అమరావతి: దశాబ్దాలుగా ఎన్నికల ప్రక్రియను సజావుగా నడిపిన ఘనత రెవెన్యూ శాఖదని ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు., 2019 ఎన్నికల గడువు తక్కువ ఉన్నా కష్టానష్టాలను అధిగమించి ఎన్నికలను సజావుగా జరిపించామని, తీవ్ర ఒత్తిడిలో కూడా ఎన్నికలను విజయవంతంగా నిర్వహించామని పేర్కొన్నారు. కనీస సౌకర్యాలు లేకున్నా తెల్లవారేదాక ఎన్నికలు నిర్వహించిన ఘనత తమదేనని గుర్తు చేశారు.
 
నూజివీడు, కొవ్వూరు, సూళ్లూరుపేట తహశీల్దార్లను సస్పెండ్ చేయడంపై ఎలక్షన్ కమీషనర్‌ను కలిశామని, వివిపాట్ స్లిపులు బయటపడ్డాయని సాకుతో క్రిమినల్ కేసులు పెట్టడంపై ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లామని బొప్పరాజు తెలిపారు. రాజకీయ ప్రయోజనాలకై ఉద్యోగులను బలిచేయొద్దని కోరారు. ఎన్నికల విధులకు ఒక్క తహశీల్దార్లనే కాకుండా మిగతా వారు కూడా పాల్గొనేలా చూడాలని, ఎన్నికల విధులకు హాజరైన వారికి బడ్జెట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *