ఓఆర్ఓపీకి కొత్త అర్థం చెప్పిన అమిత్‌షా


నహాన్ (హిమాచల్ ప్రదేశ్): నరేంద్ర మోదీ ప్రభుత్వం జాతీయ భద్రతను కాపాడటంతో పాటు గత సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి రాగానే ఆర్మీ సిబ్బందికి ‘వన్ ర్యాంక్ వన్ పెన్షన్’ (ఓఆర్ఓపి) పథకం అమలు చేసిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఆదివారంనాడు హిమాచల్ ప్రదేశ్‌లోని నహాన్‌లో జరిగిన ఎన్నికల ప్రచారం సభలో అన్నారు.  కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఓఆర్‌ఓపీ అంటే ‘వన్ రాహుల్, వన్ ప్రియాంక’ (ఒక రాహుల్, ఒక ప్రియాంక) మాత్రమేనని ఆయన కొత్త భాష్యం చెప్పారు.
 
మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం ఏడాదిలోనే ఓఆర్ఓపీ పథకానికి ఆమోదం తెలిపిందని, అభివృద్ధి పనులతో పాటు దేశానికి భద్రత కల్పించే అతిపెద్ద పని సమర్ధవంతంగా నిర్వహించిందని అన్నారు. దేశంలో ఎక్కడ చూసినా ‘మోదీ, మోదీ’ అనే నినాదం మాత్రమే వినిపిస్తోందని, నిజానికి అది నినాదం మాత్రమే కాదని, మళ్లీ అధికారంలోకి రాబోతున్న పీఎంకు ప్రజలు ఇస్తున్న ఆశీర్వాదమని అన్నారు. గత ఐదేళ్లలో హిమాచల్ ప్రదేశ్‌తో పాటు దేశావ్యాప్తంగా ఎన్నో అభివృద్ధి పనులను మోదీ సర్కార్ చేపట్టిందన్నారు. మోదీ ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ యోజనతో పేదలకు రూ.5 లక్షల వరకూ ఉచిత వైద్య చికిత్స అందుతుందని అమిత్‌షా చెప్పారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *