ఓటు వేసిన మణిపూర్ ముఖ్యమంత్రి, అవాక్కయిన ఓటర్లు


న్యూఢిల్లీ : నిబంధనలను రూపొందించేవారే అమలు చేయకపోవడం దారుణం. ఓటు వేయడానికి వరుసలో నిల్చుని, తమ వంతు వచ్చే వరకు వేచి చూడాలన్న సదుద్దేశం ప్రతి ఒక్కరికీ ఉండాలి. మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ తన ఓటు హక్కును వినియోగించుకున్న తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది.
 
ఇన్నర్ మణిపూర్ లోక్‌సభ స్థానంలోని హెయిన్‌గాంగ్ శాసనసభ నియోజకవర్గంలో బీరేన్ సింగ్. ఆయన సతీమణి గురువారం ఓటు వేశారు. పోలింగ్ ప్రారంభ సమయం ఉదయం 7 గంటల కన్నా ముందే వచ్చి వరుసలో నిల్చున్న ఓటర్లను ఆయన పట్టించుకోలేదు. చకచకా పోలింగ్ స్టేషన్‌కు వచ్చి, తన కన్నా ముందుగా వచ్చి, వరుసలో నిల్చున్నవారిని దాటుకుంటూ వెళ్ళి ఓటు వేశారు. ముఖ్యమంత్రి ఈ విధంగా ఓటు వేయడాన్ని చూసిన అక్కడి ఓటర్లు రుసరుసలాడారు.
 
కొందరు ఓటర్లు మాట్లాడుతూ చాలా మంది రాజకీయ నాయకులు వరుసలో నిల్చుని, తమ వంతు వచ్చిన తర్వాత ఓటు వేస్తున్నారని, బీరేన్ అలాంటి సంప్రదాయాన్ని పాటించలేదని అన్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *