ఓటు వేసిన 105 ఏళ్ల వృద్ధురాలు


హజారీబాగ్: లోక్‌సభ ఎన్నికల్లో ఐదవదశ పోలింగ్ జరుగుతోంది. ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు చేరుకుని, తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. కొంతమంది ఓటర్లు ఎండ నుంచి రక్షణకు గొడుగులను తమ వెంట తెచ్చుకుంటున్నారు. జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లోని బూత్ నంబర్ 450లో 105 ఏళ్ల వృద్ధురాలు ఓటు వేసింది. ఒక వ్యక్తి ఆమెను ఎత్తుకుని పోలింగ్ కేంద్రానికి తీసుకువచ్చారు. కాగా బీహార్‌లోని సారణ్ పరిధిలోని ఒక పోలింగ్ బూత్‌లోకి చొరబడిన ఒక యువకుడు ఈవీఎంను ధ్వంసం చేశాడు. దీంతో పోలీసులు ఆ యువకుడిని అరెస్టు చేశారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *