కర్ణాటకలో బీజేపీ నేత యడ్యూరప్ప వ్యాఖ్యల కలకలం


బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత బీఎస్ యడ్యూరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రస్తుత కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం పట్ల అసంతృప్తితో ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు. ఆ అసంతృప్త ఎమ్మెల్యేలు ఏ క్షణంలో ఏ నిర్ణయమైనా తీసుకునే అవకాశం ఉందని చెప్పారు. వేచి చూడాలని ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కర్ణాటక రాజకీయాల్లో కలకలం రేపాయి. అయితే.. యడ్యూరప్ప ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఇదేం తొలిసారి కాదు. గతంలో కూడా ఆయన పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని వ్యాఖ్యానించిన సందర్భాలున్నాయి.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *