కళ్లు కాయలు కాస్తున్నాయ్‌…


  • ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ
  • మరో 36 రోజులు వేచి చూడాల్సిందే…
సత్తెనపల్లి, ఏప్రిల్‌ 17: అందరిలోనూ ఒకటే ఉత్కంఠ. ఈ ఎన్నికల్లో ఎవరు గెలు స్తారు? ఏ పార్టీ అధికారం చేపట్టబో తోంది? అనే అంశాలపై చాలామంది చర్చించుకుం టున్నారు. పోలింగ్‌ ముగిసిన తర్వాత ఫలి తాల కోసం గతంలో ఎన్నడూ ఇంత సమ యం ఎదురుచూసిన దాఖలా ల్లేవు. ఈ నెల 11న పోలింగ్‌ ముగిసింది. వచ్చే నెల 23న ఫలితాలు వెలువడుతాయి. ఈసారి ఇంతకాలం వేచి ఉండటానికి ప్రధాన కార ణం రాష్ట్రంలో పోలింగ్‌ మొదటి విడతలో జరగడమే. దేశంలో ఈసారి సాధారణ ఎన్ని కలు మొత్తం 7విడతల్లో మే 19వరకు జరగ నున్నాయి. రాష్ట్రాల వారీగా, విడతల వారీగా ఈ పోలింగ్‌ ప్రక్రియ జరుగుతోంది. ప్రపం చంలో అధిక ప్రజాస్వామిక దేశాల్లో ఎన్నిక ల ప్రక్రియ రెండు, మూడు రోజుల్లో కొలిక్కి వస్తుండగా ఎన్నికల నిర్వహణలో 67 ఏళ్ళ అనుభవం ఉన్న దేశంలో ఇంత సుదీర్ఘ సమయం తీసుకోవటం ఏమిటని పలువురు మేధావులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
 
తొలి ఎన్నికలు 4 నెలలు…
1951, 52లో జరిగిన మొట్ట మొదటి సాధారణ ఎన్నికలు పూర్తి చేయటానికి దాదాపు 4 నెలల సమయం పట్టింది. 1951 అక్టోబర్‌ 25న ప్రారంభమైన ఎన్నికల ప్రక్రి య 1952 ఫిబ్రవరి 21న పూర్తయింది. 1962 తర్వాత అత్యంత ఎక్కువ గడువు తీసుకోబోతున్న ఎన్నికలు ఇప్పుడు జరుగు తున్నవే. ప్రస్తుతం ఏప్రిల్‌ 11న మొదటి దశ పోలింగ్‌ జరగ్గా, మే 19న చివరి విడత పోలింగ్‌ నిర్వహించనున్నారు. అంటే 42 రోజులు సమయం పడుతుంది. అంటే ఫలి తాల వెల్లడికి మరో 36 రోజులు ఎదురు చూడాల్సిందే. 2004లో 4 విడతల్లో జరిగిన ఎన్నికలకు 21 రోజులు సమయం తీసుకోగా 9 విడతల్లో జరిగిన 2014 ఎన్నికల్లో పోలింగ్‌కు 38 రోజులు గడువు పట్టింది.
 
ఆలస్యానికి ఆ మార్గదర్శకాలే కారణం:
ఎన్నికల కమిషన్‌కు ఇన్నాళ్ళు అనుభవం ఉన్న తర్వాత కూడా వ్యవధిని పెంచుతూ పోతోంది. వివిధ రకాల సాంకేతికతలు అందుబాటులోకి వచ్చినా ఇలా గడువు పెరగటానికి 1980లో ఎన్నికల కమిషనర్‌ టీఎన్‌ శేషన్‌ రూపొందించిన మార్గదర్శకాలే ప్రధాన కారణం. వాస్తవానికి శేషన్‌ రాకతో ఎన్నికల కమిషన్‌కు గల మొత్తం అధికారా లు వెలుగు చూశాయి. ఆయన నిర్ణయాల కు సుప్రీంకోర్టు కూడా మద్దతు ఇవ్వటంతో ఎన్నికలు ఎంత త్వరగా ముగించటం అనే దానికి ప్రాధాన్యం తగ్గి ఎంత పారదర్శకం గా నిర్వహించామనే దానికి ప్రాచుర్యం లభించింది. బూత్‌లు ఆక్రమించటం, బ్యాలె ట్‌ బాక్సులు ఎత్తు కెళ్ళటం, రిగ్గింగులకు పాల్పడటం వంటి చర్యలు 1990కి ముందు సాధారణ అంశాలుగా ఉండేవి. పోలింగ్‌ను
సజావుగా నిర్వహించటం స్ధానిక పోలీ సులకు శక్తికి మించిన పనిగా నే ఉండేవి. అంతేకాకుండా రాజకీయ నాయకులతో మొహ మాటా లు, ఒత్తిళ్లు, ప్రలోభాలు పోలింగ్‌ను పూర్తిగా ప్రభావితం చేసేవి. ధనవంతులు, శక్తి మంతులు, గూండాల పిడికిళ్ళల్లో పోలింగ్‌ బూత్‌లు గిజగిజలాడి పోయేవి. దీంతో పారామిలి టరీ దళాలను రంగంలోకి దించి పోలింగ్‌ ప్రక్రియను పారదర్శ కంగా నిర్వహించడానికి విడతల వారీగా ఎన్నికలు జరుగుతు న్నాయి. సరిహద్దు నుంచి ఎన్నికలు జరిగే అన్ని ప్రాంతాలకు పారా మిలిటరీ దళాలు తరలించటానికి ఆలస్యం తప్పటం లేదంటున్నారు.
 
సుదీర్ఘ ప్రక్రియ కారణంగా లాభనష్టాలు:
సుదీర్ఘ పోలింగ్‌ ప్రక్రియ కారణంగా లాభనష్టాలు రెండూ ఉన్నాయి. మొదటి రెండు విడతల్లో పోలింగ్‌ ముగిసే అభ్యర్థులకు శ్రమ, ఖర్చు తగ్గుతున్నాయి. చివరి దశలో జరిగే ప్రాంతా ల్లో ఈ కోణంలో అందుకు విరుద్ధమైన నష్టాలు ఉన్నాయి. దీనివల్ల అదనంగా కొన్ని ప్రయోజనాలు ఉన్నాయని పలువురు అంటున్నారు. వెంటనే ఫలితాలు ప్రకటించటం వల్ల వేర్వేరు పార్టీల కార్యకర్తల మధ్య విభేదాలు, వైషమ్యాలు, కక్షలు పెచ్చరిల్లే ముప్పు ఉంది. దీంతో ఎన్నికల తర్వాత శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని అంటున్నారు. ఫలితాల వెల్లడికి సుదీర్ఘ సమయం తీసుకోవటం వల్ల చాలావరకు ఉద్రిక్త తలు సద్దుమణిగి సర్దుబాటు వాతావరణానికి ఆ స్కారం ఏర్పడుతుందని పలువురు అంటున్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *