కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతిచ్చిన ముఖేష్.. మోదీ సభలో అనంత్!


ముంబై: నగరంలో భారతీయ జనతా పార్టీ, శివసేన ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో భారత అపర కుబేరుడు ముకేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ పాల్గొన్నారు. ప్రధాన వేదికకు ముందు ఏర్పాటు చేసిన మొదటి వరుసలో కూర్చొని మోదీతో పాటు సభలోని నేతల ప్రసంగాల్ని విన్నారు. అయితే ఈ విషయమై అనంత్ అంబానీని ప్రశ్నించగా తాను ప్రధాని మోదీ ప్రసంగాన్ని వినడానికి, దేశానికి మద్దతు తెలపడానికి వచ్చానని ఓ మరాఠీ న్యూస్ ఛానల్‌తో అన్నారు.
 
ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త మిలింద్ దేవ్‌డాకు మద్దతిస్తున్నట్లు కొద్ది రోజుల క్రితం ముఖేష్ అంబానీ ప్రకటించారు. అయితే ఇది జరిగిన కొద్ది రోజుల తర్వాత తనయుడు నరేంద్రమోదీ ప్రచార సభలో పాల్గొనడం చర్చనీయాంశమైంది. ముంబైలోని బాంద్రాలో గల కుర్లా కాంప్లెక్స్‌లో శివసేన, బీజేపీ సంయుక్తంగా ఎన్నికల ప్రచార సభ నిర్వహించాయి. ఈ ప్రచార సభకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొని ప్రసంగించారు.
 
సభకు ముందు ఏర్పాటు చేసిన మొదటి వరుసలో అనంత్ అంబానీ కూర్చున్నారు. సభ ముగిసిన అనంతరం అనంత్‌ను మీడియా ప్రశ్నించింది. ‘‘నేను మోదీ ప్రసంగం వినడానికి, దేశానికి మద్దతివ్వడానికి వచ్చాను’’ అని సమాధానం చెప్పారు అనంత్ అంబానీ. కాగా దక్షిణ ముంబై నియోజకవర్గంలో ఈ నెల 29న పోలింగ్ జరగనుంది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *