కాక్‌పిట్‌లో మహిళా ఉద్యోగినిపై పైలెట్ లైంగిక వేధింపులు


న్యూఢిల్లీ : విమానంలోని కాక్‌పిట్‌లోనే కేబిన్ క్రూ మహిళను సాక్షాత్తూ పైలెట్ లైంగికంగా వేధించిన ఘటన న్యూఢిల్లీలోని ఇండిగో విమానంలో జరిగింది. బెంగళూరు -అమృత్‌సర్ – శ్రీనగర్ – ఢిల్లీ ఇండిగో విమానంలో ఓ మహిళ విమాన క్రూ విభాగంలో పనిచేస్తోంది. కో పైలెట్ వాష్‌రూంకు వెళ్లినపుడు తాను పైలెట్‌కు వేడి మంచినీరు అందించేందుకు కాక్‌పిట్ లోకి వెళ్లగా, అతను తనను లైంగికంగా వేధించాడని మహిళా ఉద్యోగిని న్యూఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పైలెట్ తనతో కలిసి సెల్ఫీ తీసుకునేందుకు యత్నించగా తాను తిరస్కరించానన్నారు. తాను పైలెట్ బారి నుంచి తప్పించుకొని కాక్‌పిట్ నుంచి విమానంలోకి వచ్చానని పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. విమానం అమృత్‌సర్‌లో ల్యాండ్ అయినపుడు పైలెట్ తన ఫోన్ అడిగాడని, ఢిల్లీ చేరుకున్నాక పైలెట్ తనను ఆలింగనం చేసుకున్నాడని మహిళా ఉద్యోగిని ఫిర్యాదు చేశారు. ఇండిగో పైలెట్ సాగించిన లైంగిక వేధింపులపై మహిళా ఉద్యోగిని పోలీసులతోపాటు ఇండిగో యాజమాన్యం, పౌరవిమానయాన శాఖ డైరెక్టరు జనరల్ కు ఫిర్యాదులు పంపించారు. ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి పైలెట్ పై దర్యాప్తు ప్రారంభించారు. తమ ఇండిగో విమానంలో జరిగిన ఘటనపై సంస్థ ఆధ్వర్యంలోనూ దర్యాప్తు చేస్తున్నామని, దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని ఇండిగో అధికార ప్రతినిధి చెప్పారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *