కాఫీ పొడితో గాంధీ బొమ్మ


  •  అలుపెరగని కృషి.. అబ్బురపరుస్తున్న ‘చిత్రం’
  •  కొనసాగుతున్న దేవీశ్రీ ప్రపంచ రికార్డు సాధన
ఒంగోలు (కార్పొరేషన్‌) మే 8: సృష్టి ఆర్ట్‌ అకాడమీ విద్యార్థి ఆదిపూడి దేవీశ్రీ ప్రపంచ రికార్డు సాధన కోసం చేస్తున్న కృషికి ప్రశంసలు అందుతున్నాయి. ఒంగోలు ఎంహెచ్‌ఆర్‌ ఫంక్షన్‌ హాలులో తన ప్రయత్నాన్ని ప్రారంభించగా బుధవారం 70ు చిత్రాన్ని గీసి రికార్డు సాధనకు చేరువ అయ్యారు. వృథా కాఫీ పొడిని తన కుంచెతో 150 మీటర్లగాంధీజీ చిత్రాన్ని గీస్తూ అబ్బురపరుస్తున్నారు. రెండోరోజైన బుధవారం ఒంగోలు ఆర్డీఓ పెంచల కిషోర్‌ చిత్రాన్ని పరిశీలించారు. తప్పకుండా వరల్డ్‌ రికార్డు సాధించి తల్లిదండ్రులకు, గురువులకు, జిల్లాకు మంచిపేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *