కాబోయే ప్రధాన మంత్రి మా రాహుల్ గాంధీయే : కాంగ్రెస్


న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎక్కువ స్థానాలు లభిస్తే, రాహుల్ గాంధీ తదుపరి ప్రధాన మంత్రి అవుతారని ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు ఆనంద్ శర్మ చెప్పారు. పనజిలో విలేకర్ల సమావేశంలో ఆనంద్ శర్మ మాట్లాడుతూ 2004లో అటల్ బిహారీ వాజ్‌పేయి నాయకత్వంలోని బీజేపీ ఓటమి పాలైనట్లుగానే ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వం కూడా ఓడిపోతుందని జోస్యం చెప్పారు.
 
‘‘తదుపరి ప్రధాన మంత్రి ఎవరనేది నేతలు నిర్ణయిస్తారు. ఏ పార్టీ ఆధిక్యంలో ఉంటుందనేదాని మీద ఆధారపడి ఉంటుంది. అది కాంగ్రెసే అయితే రాహుల్ గాంధీయే తదుపరి ప్రధాన మంత్రి అవుతారు’’ అని ఆనంద్ శర్మ అన్నారు. ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత కూడా పొత్తులు ఉంటాయన్నారు. ఏదైనా లోక్‌సభ ఎన్నికల ఫలితాలపైనే ఆధారపడి ఉంటుందన్నారు. తాను జ్యోతిష్కుడిని కాదని, అయితే ఓ విషయాన్ని మాత్రం చెప్పగలనని అంటూ, నరేంద్ర మోదీ మళ్ళీ ప్రధాన మంత్రి కాబోరని చెప్పారు. బీజేపీ ఓడిపోతుందన్నారు. కాంగ్రెస్‌కు ఎక్కువ స్థానాలు వస్తాయన్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *