కాలినడకన తిరుమలకు డీజీపీ దంపతులు


తిరుపతి(నేరవిభాగం), ఏప్రిల్‌ 22: రాష్ట్ర డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (డీజీపీ) ఆర్పీ ఠాకూర్‌ శ్రీవారి దర్శనార్థం కాలినడకన తిరుమలకు వెళ్లారు. శనివారం రాత్రి తిరుపతి వచ్చిన ఆయన సోమవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో తన భార్యతో కలిసి అలిపిరి మెట్ల మార్గంలో తిరుమలకు వెళ్లారు. మంగళవారం వేకువన శ్రీవారిని దర్శించుకుని తిరిగి తిరుపతికి చేరుకుంటారు. అనంతరం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ను కలవనున్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *