కుమారుడి విజయం కోసం సీఎం హోమాలు..!


బెంగళూరు: దేవుడి ఆశీర్వాదంతోనే ముఖ్యమంత్రి అయ్యానని పదేపదే చెప్పుకుంటున్న కుమారస్వామి ప్రస్తుతం మరిన్ని సంక్లిష్టమైన సమస్యలలో మునిగిన విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల తర్వాత సంకీర్ణ ప్రభుత్వం కూలిపోనుందనే చర్చలు జోరుగా సాగుతుండటం, మండ్య నుంచి పోటీ చేసిన కుమారుడు నిఖిల్‌ గెలుపు అంతసులువు కాదనే ప్రచారాల తరుణంలో ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రశాంతతో పాటు అన్నీ అనుకూలంగా జరగాలని కోరుకుంటూ ప్రత్యేక హోమాలు జరిపించేందుకు సిద్దమయ్యారు. ఉడిపి జిల్లా సాయిరాధా ప్రకృతి చికిత్సా కేంద్రంలో గడుపుతున్న శుక్రవారం సాయంత్రం సీఎం నేరుగా చిక్కమగళూరు జిల్లాకు బయలుదేరా రు.
 
శృంగేరి శారదాదేవిని దర్శించుకుని నేరుగా కొప్పళ తాలూకా కమరడి సమీపంలోని అటవీప్రాంతం గుడన్డనహళ్ళిలో వెలసిన ఉమామహేశ్వరి ఆలయంలో శనివారం తెల్లవారుజాము నుంచి ఆదివారం మధ్యాహ్నం దాకా హోమాలు సాగనున్నాయి. ఉగాది తర్వాత వచ్చిన తొలి అమావాస్య కావడంతో హోమాల ద్వారా దోషాల నివారణలకు అనుకూలమనే ఈ ముహూర్తం నిర్ణయించినట్లు తెలుస్తోంది. సీఎం కుమారస్వామితో పాటు భార్య రామనగర్‌ ఎమ్మెల్యే అనితా, కుమారుడు మండ్య లోక్‌సభ అభ్యర్థి నిఖిల్‌తోపాటు దేవేగౌడ ఆయన భార్య సోదరుడు మంత్రి రేవణ్ణ కుటుంబీకులు పాల్గొననున్నారు. జేడీఎస్‌ నేత రంగనాథ్‌ ఎస్టేట్‌లో ముఖ్యమంత్రి కుటుంబీకులు బసచేశారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *