కూటమిగా ప్రకటన ఆ రోజే వస్తుందా?


న్యూఢిల్లీ: ప్రస్తుత జాతీయ రాజకీయాల రూపు మారుతోంది. మరో రెండు విడతల పోలింగ్ ఉన్నప్పటికీ కూటమి రాజకీయాలు ఊపందుకుంటున్నాయి. పోలింగ్ ముగిసిన వెంటనే బలాబలాల లెక్క తేల్చుకునేందుకు బీజేపీ వ్యతిరేక పక్షాలన్నీ సమావేశమయ్యే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ అంటూ చేస్తున్న ప్రయత్నాలు జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
 
ఈ నెల 21న బీజేపీయేతర పార్టీల భేటీ. ఫలితాల అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చ. ఓ కూటమిగా ఆ రోజే ప్రకటన వస్తుందా? సార్వత్రిక ఎన్నికల్లో హంగ్ పార్లమెంట్ ఖాయమని తేలిపోవడంతో మోదీ వ్యతిరేక పక్షాలన్నీ తమ వ్యూహాలను అంతకంతకూ పదును పెడుతున్నాయి.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *