కేంద్రం, బీహార్ రాష్ట్ర ప్రభుత్వంపై రబ్రీదేవి సంచలన వ్యాఖ్యలు


కేంద్ర ప్రభుత్వం, బీహార్ రాష్ట్ర ప్రభుత్వంపై లాలూప్రసాద్‌ యాదవ్‌ భార్య రబ్రీదేవి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం, బీహార్‌ రాష్ట్ర ప్రభుత్వం కలిసి తన భర్తపై విష ప్రయోగం చేసి ఆస్పత్రిలోనే చంపేయాలని చూస్తున్నాయన్నారు. తన భర్తను చూడటానికి వెళ్లిన తన కుమారుడు తేజస్వీయాదవ్‌ను ఆస్పత్రిలోకి రానివ్వక పోవడం వెనుక ఉద్దేశ్యమేంటని రబ్రీదేవి ప్రశ్నించారు. ఆయనకేదైనా జరిగితే.. బీహార్‌, జార్ఖండ్‌ తగలబడిపోతాయని హెచ్చరించారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *