కొత్త నిబంధనలు పాటించాల్సిందే.. ఆపరేటర్లకు ట్రాయ్ హెచ్చరిక



న్యూఢిల్లీ: కేబుల్ టీవీ, డీటీహెచ్ ఆపరేటర్లకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ట్రాయ్) తీవ్ర హెచ్చరికలు చేసింది. వినియోగదారుల ఇష్టాయిష్టాలే అంతిమమని.. కొత్త నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని తెలిపింది. ట్రాయ్ చైర్మన్ ఆర్ఎస్ శర్మ సోమవారం మాట్లాడుతూ.. ఆపరేటర్లపై తమకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయని.. వెంటనే వాటిని సవరించుకోవాలని ఆదేశించారు. సాఫ్ట్ వేర్ సమస్యలపైనా, ఛానళ్ల ప్రసారాలపైనా ఫిర్యాదులు ఉన్నాయని తెలిపారు. వినియోగదారుడి ప్రయోజనాల విషయంలో రాజీ పడేది లేదని ట్రాయ్ చైర్మన్ తేల్చి చెప్పారు. చందాదారులు, కేబుల్‌ నిర్వాహకుల వ్యవస్థలను త్వరలోనే ఆడిట్‌ చేయనున్నట్లు తెలిపారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *