కొలంబోలో వరుస పేలుళ్లు: భారీ సంఖ్యలో మృతులు


కొలంబో: ఈస్టర్ పర్వదినమైన ఆదివారం ఉదయం శ్రీలంక రాజధాని కొలంబోను వరుస బాంబు పేలుళ్లు కుదిపేశాయి. మూడు చర్చిలు, రెండు హోటళ్లు లక్ష్యంగా జరిగిన బాంబు పేలుళ్లలో 25 మంది మృతి చెందారు. 200 మంది వరకూ గాయపడ్డారు. ప్రమాద తీవ్రతను బట్టి మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఆస్తినష్టం కూడా ఎక్కువగానే ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
 
కోచికడే, సెయింట్ సెబాస్టియన్, బట్టికలోయ చర్చిల్లో ఈస్టర్ ప్రార్థనలు చేస్తున్న భక్తులను టార్గెట్ చేసుకుని ఈ దాడులు జరిగినట్టు ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు హోటల్ షాంగ్రి లా, సిన్నమాన్ గ్రాండ్ హోటల్స్‌లోనూ పేలుళ్ల చోటుచేసుకున్నాయి. ఈస్టర్ సండే ప్రార్థనలు జరుగుతుండగా ఉదయం 8.45 గంటల ప్రాంతంలో వరుస పేలుళ్లు చోటుచేసుకున్నట్టు పోలీసు ప్రతినిధి రువాన్ గుణశేఖర తెలిపారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *