‘కోడికత్తి’ శ్రీనివాసరావు డిశ్చార్జి


రాజమహేంద్రవరం అర్బన్‌, ఏప్రిల్‌ 24: వైసీపీ అధ్యక్షుడు జగన్‌పై కోడి కత్తితో దాడి చేసిన జె.శ్రీనివాసరావు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యాడు. రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న శ్రీనివాసరావుకు రెండు రోజుల క్రితం జ్వరం రావడంతో రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. మంగళవారం వైద్య పరీక్షలు నిర్వహించి టైఫాయిడ్‌ జ్వరంతో బాధపడుతున్నట్టు వైద్యులు నిర్థారించారు. చికిత్స అనంతరం బుధవారం అతన్ని డిశ్చార్జ్‌ చేశారు. ఐదు రోజుల తర్వాత మళ్లీ చెకప్ కు రావాలని సూచించినట్టు ఆస్పత్రి ఆర్‌ఎంవో డాక్టర్‌ పద్మశ్రీ తెలిపారు. కాగా, శ్రీనివాసరావు సోదరుడు సుబ్బరాజు మంగళవారం ఆస్పత్రికి వచ్చి అతన్ని చూసివెళ్లారు. బుధవారం మళ్లీ సుబ్బరాజు వచ్చేసరికి శ్రీనివాసరావును సెంట్రల్‌ జైలుకు తరలించేశారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *