కోవై విమానాశ్రయంపై లేజర్‌ కిరణాలు!


చెన్నై, మే 12 (ఆంధ్రజ్యోతి): తమిళనాడులోని పరిశ్రమల నగరం కోయంబత్తూర్‌(కోవై)లో ఉన్న విమానాశ్రయంపై రాత్రి సమయంలో లేజర్‌ కిరణాలు ప్రసరించడం కలకలం సృష్టించింది. ఇది ఉగ్రవాదుల కుట్ర కావచ్చనే అనుమానంతో పోలీసులు నగరవ్యాప్తంగా ముమ్మర తనిఖీలు నిర్వహించారు. భారత్‌లోనూ శ్రీలంక తరహా ఉగ్రదాడులు జరిగే అవకాశముందని ఇంటెలిజెన్స్‌విభాగం హెచ్చరించడంతో భద్రత కట్టుదిట్టం చేశారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి కోవై విమానాశ్రయంపై లేజర్‌ కిరణాలు అప్పుడప్పుడు ప్రసారమవుతున్నాయని గుర్తించిన సీఐఎ్‌సఎఫ్‌ బలగాలు.. సూలురు పోలీసులకు సమాచారం అందజేశాయి. లేజర్‌ కిరణాలు విమానాశ్రయం చుట్టుపక్కనున్న హోటళ్ల నుంచి ప్రసారం కాలేదని పోలీసు విచారణలో తేలింది. వేరే ఏదైనా ప్రాంతం నుంచి శక్తిమంతమైన టార్చిలైట్‌ ద్వారా ఈ పని చేసి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *