కోస్తా, రాయలసీమల్లో వర్షాలు


విశాఖపట్నం, ఏప్రిల్‌ 19(ఆంధ్రజ్యోతి): ఛత్తీ్‌సగఢ్‌ నుంచి విదర్భ, తెలంగాణ మీదుగా కర్ణాటక వరకు ద్రోణి, ఛత్తీ్‌సగఢ్‌ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నాయి. వీటి ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల ఉరుములు, ఈదురుగాలులతో వర్షాలు కురిశాయి. శుక్రవారం ఉదయానికి మార్కాపురంలో 8, రాప్తాడులో 5, మాచర్ల, ఎర్రగొండపాలెం, అనంతపురంలో 3సెం.మీ. వర్షపాతం నమోదైంది. రానున్న 24గంటల్లో కోస్తా, సీమల్లో ఉరుములు, ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. శుక్రవారం తిరుపతిలో 41.4డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *