క్యూలో నిలబడి ఓటు వేసిన రాష్ట్రపతి కోవింద్…


న్యూఢిల్లీ: 2019 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఇవాళ జరుగుతున్న ఆరోదశ పోలింగ్‌లో భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్రపతి భవన సముదాయంలోని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సర్వోదయ విద్యాలయ పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు వేశారు. తన సతీమణి సవితా కోవింద్‌తో కలిసి పోలింగ్ బూత్‌కి వెళ్లిన ఆయన… అందరితో పాటు క్యూలైన్‌లో నిలబడి ఓటు వేయడం విశేషం. కాగా ఇవాళ ఉదయం 10 గంటల సమయానికి 10.80 శాతం పోలింగ్ నమోదైంది.
 
ఆరోదశ లోక్‌సభ ఎన్నికల్లో ఇవాళ మొత్తం ఏడు రాష్ట్రాల్లో 59 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. యూపీలో 14, హర్యానా 10, పశ్చిమ బెంగాల్ 08, మధ్యప్రదేశ్ 08, బిహార్ 08, ఢిల్లీ 07, జార్ఖండ్ 04 లోక్‌సభ స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 10 కోట్ల మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు.
  

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *