గంభీర్…రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు?


న్యూఢిల్లీ: మాజీ క్రికెటర్, ఈస్ట్ ఢిల్లీ బీజేపీ అభ్యర్థి గౌతమ్ గంభీర్‌పై అదే నియోజవకర్గం నుంచి ఆప్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అతిషి మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. తనతో బహిరంగ చర్చకు రావాలంటూ ఆమె చేసిన సవాలను గౌతమ్ గంభీర్ తోసిపుచ్చడంపై ఆమె ట్వీట్‌లో విమర్శలు ఎక్కుపెట్టారు. డిబేట్లు అంటే ఇష్టం లేనప్పుడు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు? అంటూ నిలదీశారు.
 
ధర్నాలన్నా డిబేట్‌లన్నా తనకు నమ్మకం లేదంటూ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో గంభీర్ పేర్కొన్నారు. దీనిపై అతిషి స్పందిస్తూ ‘డిబేట్లంటే నమ్మకం లేని మీరు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చినట్టు? ఢిల్లీ ప్రభుత్వం క్రికెట్ అకాడమీ ప్రారంభిస్తోంది. ఆ అకాడమీని మీరెందుకు నడపకూడదు?’ అని అతిషి తన ట్వీట్‌లో ప్రశ్నించారు. గౌతమ్ గంభీర్‌కు రెండు ఓటర్ ఐడీలు ఉన్నాయని, ఆయనపై ఈసీ అనర్హత వేటు వేయాలని అతిషి ఇటీవల ఆరోపణలు చేశారు. అనుమతి లేకుండా ర్యాలీ తీయడంపైనా ఈసీకి ఆమె ఫిర్యాదు కూడా చేశారు. రూల్స్ తెలియకుండా గేమ్ ఆడటమేంటని కూడా ఆయనపై వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *