‘గణితం’పై గగ్గోలు


  • సుదీర్ఘ, సంక్లిష్ట ప్రశ్నలతో బిత్తరపోయిన పిల్లలు
  • ఆర్గానిక్‌, ఫిజికల్‌ కెమిస్ట్రీలో ఎక్కువ ప్రశ్నలకు
  • టైమ్‌ సరిపోలేదని అభిప్రాయం
  • ఎంసెట్‌కు 93.86% హాజరు
  • కొన్ని కేంద్రాల్లో సాంకేతిక సమస్యలు
  • ఆలస్యం కావడంతో అదనపు సమయం
అమరావతి, ఏప్రిల్‌ 20(ఆంధ్రజ్యోతి): ఎంసెట్‌-ఇంజనీరింగ్‌ విభాగంలో గణితంలో ఇచ్చిన ప్రశ్నలు అభ్యర్థులకు చుక్కలు చూపించాయి. ప్రశ్నలు సుదీర్ఘంగా, క్లిష్టంగా ఉండటంతో బాగా చదివే పిల్లలు సైతం బిత్తరపోయారు. ఇంజనీరింగ్‌ విభాగంలో శనివారం మొదటి సెషన్‌లో గణితంలో మొత్తం 80 ప్రశ్నలు ఇవ్వగా… అందులో దాదాపు 30 ప్రశ్నల వల్ల తాము ఇబ్బందిపడినట్లు పలువురు అభ్యర్థులు ఆందోళన వ్యక్తంచేశారు. ప్రశ్నలు సుదీర్ఘంగా ఉండటంతో సమాధానం రాయడానికి ఎక్కువ సమయం పట్టిందని వారు చెప్పారు. ఇక కెమిస్ట్రీ విషయానికి వస్తే… ఆర్గానిక్‌ కెమిస్ట్రీ, ఫిజికల్‌ కెమిస్ట్రీలో ఎక్కువ ప్రశ్నలు ఇచ్చారని, వాటికి సమాధానం రాయడానికి కూడా ఎక్కువ సమయం పట్టిందన్న భావన వారిలో వ్యక్తమైంది. సాధారణంగా ఆర్గానిక్‌ ప్రశ్నలు విద్యార్థులకు కొంచెం ఇబ్బంది పెడుతుంటాయి. అదే ఇనార్గానిక్‌ కెమిస్ట్రీలో ప్రశ్నలు అయితే త్వరితగతిన సమాధానాలు ఇచ్చేందుకు అవకాశం ఉంటుందని పలువురు పిల్లలు చెబుతున్నారు.
 
ఇక ఫిజిక్స్‌ విషయానికి వస్తే… గణితం, కెమిస్ట్రీతో పోలిస్తే ఫర్వాలేదని చాలామంది అభిప్రాయపడ్డారు. ఫిజిక్స్‌ ప్రశ్నలు ఓ మాదిరిగానే ఉన్నాయని చెబుతున్నారు. శనివారం రెండో సెషన్‌లోనూ గణితం ప్రశ్నలు సుదీర్ఘంగా ఉన్నట్లు పలువురు అభ్యర్థులు తెలిపారు. మొత్తం 80 ప్రశ్నలకుగాను సుమారు 15 ప్రశ్నలకు సమాధానాలు రాయలేకపోయామని వారు వివరించారు. సమయం సరిపోతేదన్న అభిప్రాయం వారు వ్యక్తం చేశారు. ఇక కెమిస్ట్రీ, ఫిజిక్స్‌ ప్రశ్నలు ఫర్వాలేదని పలువురు అభ్యర్థులు చెప్పారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *