గాయకుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత హీరాలాల్ కన్నుమూత


వారణాసి: ప్రముఖ భోజ్‌పురి గాయకుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత హీరాలాల్ యాదవ్ ఆదివారంనాడు వారణాసిలో కన్నుమూశారు. ఆయన వయస్సు 93 ఏళ్లు. భోజ్‌పురి జానపద గాయకుడిగా యాదవ్ ఎంతో పేరు తెచ్చుకున్నారు. అస్వస్థత కారణంగా కొద్ది నెలలుగా ఆయన ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం కన్నుమూసినట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. రెండ్రోజుల క్రితమే ఆయనకు ప్రధాని మోదీ ఫోను చేసి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
 
దేశంలో నాలుగవ అత్యున్నత పౌర అవార్డు అయిన పద్మశ్రీతో హీరాలాల్‌ను భారత ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో సన్మానించింది. సంగీతరంగంలో చేసిన కృషికి గాను 2015లో యష్ చోప్రా అవార్డును ఆయనకు ప్రదానం చేశారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *