గొగోయ్‌పై లైంగిక ఆరోపణల కేసు: త్రిసభ్య కమిటీకి ఎన్వీ రమణ దూరం


న్యూ ఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్‌పై మహిళా ఉద్యోగి చేసిన లైంగిక ఆరోపణల కేసులో ముగ్గురు జస్టిస్‌లతో ఈనెల 23న అంతర్గత విచారణ కమిటీ వేసిన సంగతి తెలిసిందే. అయితే కమిటీ వేసిన నాటి నుంచి నేటి వరకు ఉన్న జస్టిస్ ఎన్వీ రమణ తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీజేఐపై లైంగిక వేధింపుల కేసు విచారణ కమిటీ నుంచి వైదొలుగుతున్నట్లు స్పష్టం చేశారు. మహిళా ఆరోపణల్లో వాస్తవం లేదని ఆయన చెప్పారు. అయినా తాను విచారణ కమిటీలో ఉండదల్చుకోలేదన్నారు. ఇదిలా ఉంటే ఎన్వీ రమణ స్థానంలో కమిటీలో ఇందు మల్హోత్రాను నియమించడం జరిగింది.
 
కాగా.. జస్టిస్ రమణ, జస్టిస్ రంజన్ గొగోయ్ కుటుంబ స్నేహితులని, అయన విచారణలో న్యాయం జరగదని లైంగిక ఆరోపణలు చేసిన మహిళా ఉద్యోగి అభ్యంతరం వ్యక్తం చేయడంతో జస్టిస్ రమణ తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఎస్ఏ బోడ్‌బే, ఎన్వీ రమణ, ఇందిరా బెనర్జీతో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *