గ్రూప్‌-2 కు 53.29 శాతం హాజరు


  • పరీక్ష రాసిన 15, 393 మంది విద్యార్థులు
విజయవాడ (చుట్టుగుంట): జిల్లా వ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన గ్రూప్‌ -2 ీస్క్రనింగ్‌ పరీక్షకు 53.29 శాతం అభ్యర్థులు హాజరైనట్లు కలెక్టర్‌ ఇంతియాజ్‌ తెలిపారు. ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 పరీక్ష కేంద్రాలను కలెక్టర్‌ పరిశీలించారు. నగరంలోని బిషప్‌ అజరయ్య బాలికోన్నత పాఠశాల, నలంద డిగ్రీ కళాశాల, దుర్గామల్లేశ్వర సిద్ధార్థ మహిళా డిగ్రీ కళాశాల, ఎస్‌ఆర్‌ఆర్‌ అండ్‌ ిసీవీఆర్‌ కళాశాలను పరిశీలించారు. పరీక్షకు 28.884 మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా 15.393 మంది హాజరయ్యారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 55 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, తాగునీరు, వైద్య , తదితర సదుపాయాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఏపీఆర్‌టీసీ పరీక్షా కేంద్రాలకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎటువంటి లోటు పాట్లు లేకుండా పరీక్షను ప్రశాంతంగా నిర్వహించామని ఇంతియాజ్‌ పేర్కొన్నారు.
 
గుడ్లవల్లేరు, గ్రూప్‌ 2 పోటీ పరీక్షలు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్‌ కళాశాలలో ఆదివారం ఉదయం నిర్వహించారు. 1046 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా 453 మంది హాజరయ్యారు. కాగా 593 మంది గైర్హాజరయ్యారని జీఈసీ ప్రిన్సిపాల్‌ పి.రవీంద్రబాబు తెలిపారు.

 

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *