గ్రూప్‌-2 స్ర్కీనింగ్‌ టెస్ట్‌ నేడే


  •  727 కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి.. ఉదయం 10 నుంచి నిర్వహణ
  •  9.45 గంటలకే కేంద్రాలకు… నెగిటివ్‌ మార్కింగ్‌ అమలు
అమరావతి, మే 4(ఆంధ్రజ్యోతి): గ్రూప్‌-2 స్ర్కీనింగ్‌ టెస్ట్‌ నేడు(ఆదివారం) జరగనుంది. ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 727 సెంటర్లలో జరగనున్న ఈ పరీక్షకు 2,95,036 మంది అభ్యర్థులు సన్నద్ధమయ్యారు. ఆఫ్‌లైన్‌లో జరిగే ఈ పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ఏపీపీఎస్సీ చైర్మన్‌ పిన్నమనేని ఉదయభాస్కర్‌ తెలిపారు. ‘‘గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ ద్వారా 446 పోస్టులను భర్తీచేస్తున్నాం. అభ్యర్థులు గ్రూప్‌-3 స్ర్కీనింగ్‌ టెస్ట్‌లో చేసిన తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలి. సెంటర్‌ విషయంలో ఏదై నా తేడా ఉంటే హెల్ప్‌లైన్‌లో సంప్రదించాలి. అభ్యర్థులు రివైజ్డ్‌ హాల్‌ టికెట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. అభ్యర్థులు ఆదివారం ఉదయం 9 గంటలకు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ 9.45 గంటల తర్వాత అనుమతించబోం’’ అని పిన్నమనేని తెలిపారు. అభ్యర్థులకు ఆయన పలు సూచనలను చేశారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *