చందనోత్సవ ఏర్పాట్లు సరిగా లేవు: స్వరూపానందేంద్ర


విశాఖ: సింహాద్రి అప్పన్న చందనోత్సవ ఏర్పాట్లు సరిగా లేవని స్వరూపానందేంద్ర సరస్వతి విమర్శించారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికారులు సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారని, ఇది తనకు బాధ కలిగించిందని అన్నారు. హిందూ ధర్మానికి ఇది మంచిది కాదని స్వరూపానంద వ్యాఖ్యానించారు.
 
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బంగారం గుట్టుచప్పుడు కాకుండా తరలిపోతే పట్టించుకునే నాథుడే లేడని స్వరూపానంద ఆవేదన వ్యక్తం చేశారు. విషయం బయటకు రాకుండా తొక్కిపెట్టారని విమర్శించారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *