చంద్రబాబుకు బ్రహ్మరథం


  • టీబీడ్యాంలో పూడిక తొలగిస్తా!
  • రెండు రాష్ట్రాల నాయ కులతో మాట్లాడుతా: ఏపీ సీఎం చంద్రబాబు
బెంగళూరు, బళ్లారి,  (ఆంధ్రజ్యోతి): తుంగభద్ర జలాశయంలో పూడిక పెరిగిపోయిందని, బచావత్‌ అవార్డు ప్రకారం 33 టీఎంసీలు నీరు ఆయకట్టుకు అందకుండా పోతోందన్నారు. జలాశయంలో పూడిక పెరగడంవల్ల రైతులు నీరు అందక ఇబ్బంది పడుతున్నారని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. కర్ణాటకలో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఆదివారం ఆయన కొప్పళ్‌జిల్లా శ్రీరామనగర్‌, సింధనూరులలో పర్యటించి అనంతరం విలేకరులతో మాట్లాడారు. కర్ణాటకలో మనకు అనుకూల ప్రభుత్వం ఉందని, అలాగే తెలంగాణాకు కూడా జలాశయానికి సంబంధం ఉందని, ఈ రెండు ప్రభుత్వాలతో తాను నేరుగా రైతుల కోసం మాట్లాడుతానని హామీ ఇచ్చారు. పెరిగిన పూడిక తొలగింపు ఇతర అంశాలపై ఇరిగేషన్‌ అధికారులతో మాట్లాడుతానన్నారు. తొలగించే పూడిక తరలింపు, అలాగే అయ్యే ఖర్చులు అన్నీ లెక్కగట్టి ప్రణాళికా బద్దంగా తుంగభద్ర జలాశయంలో పూడిక తీసేందుకు కృషిచేస్తానని చంద్రబాబు అన్నారు. రైతులకు నీరు పారుదల్లో ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూస్తామని అన్నారు. అనంతరం విలేకరులు అడిగిన ప్రశ్నల కు ఏపీలో ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నారు.

బాబుకు బ్రహ్మరథం
కర్ణాటకలో లోక్‌సభ ఎన్నికలు ఈ నెల 23న జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ తరుపున పోటీ చేసిన ఎంపీ అభ్యర్థి రాజశేఖర్‌ హిఠ్నాల్‌కు మద్దతుగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆదివారం కొప్పల్‌ జిల్లాలోని శ్రీరామనగర్‌, సింధనూరు ఏరియాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా చంద్ర బాబుకు ఇక్కడి తెలుగుప్రజలు ఘనస్వాగతం పలికారు, శ్రీరామనగర్‌లో ఏర్పాటు చేసిన హెలీక్యాప్టర్‌లో నేరుగా అక్కడికి చేరుకున్న చంద్రబాబుకు ఏపీ మంత్రి కాలవ శ్రీనివాసులు, హైదరాబాద్‌ కర్ణాటక కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి సాకే శైలజానాథ్‌, మాజీ ఎంపీ శివరాజ్‌ తంగిడిగే పుప్ప గుచ్చాన్ని ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబు అక్కడ ఉండే ప్రతిఒక్కరినీ బాగున్నారా.? అని పలకరించడంతో అందరూ సంతోషించారు. చంద్రబాబును చూసేందుకు ఈ ప్రాంతంలో ఉండే లక్షలాది మంది తెలుగువాళ్లు ఇక్కడ చేరారు. ఆయనకు పూల మాలలు వేసి స్వాతగం పలికారు. చాలా మంది తెలుగువాళ్ల తెలుగుదేశం పార్టీ జెండా చేత పట్టుకుని జై తెలుగుదేశం జై చంద్రబాబు అని నినాదం చేశారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *