చంద్రబాబు జన్మదిన వేడుకలు


  • కేకులు కోసి టీడీపీ శ్రేణుల సంబరాలు
  • రోగులకు పండ్లు, పేదలకు చీరల పంపిణీ
విజయవాడ, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడి జన్మదిన వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. నగరంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు, అభిమానులు, సీబీఎన్‌ ఆర్మీల ఆధ్వర్యంలో వాడవాడలా కేకులు కోసి అందరికీ పంపిణీ చేశారు. ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కొన్ని ప్రాంతాల్లో పేద మహిళలకు చీరలు పంచారు. ఎండలు మండిపోతున్నందున ఎక్కడికక్కడ ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలను ప్రారంభించారు. మజ్జిగ, మంచినీళ్లు సరఫరా చేశారు.
 
టీడీపీ జిల్లా కార్యాలయంలో
ఆటోనగర్‌లోని కార్యాలయంలో చంద్రబాబు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నే ప్రసాద్‌ (అన్నా) ఆధ్వర్యంలో కేకు కోశారు. ఈ కార్యక్రమానికి హాజరైన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఒకరికొకరు కేకు తినిపించుకుని ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం బచ్చుల అర్జునుడు, గన్నే ప్రసాద్‌ మాట్లాడుతూ అభివృద్ధితో పాటు పారిశ్రామికంగా నవ్యాంధ్రను కొత్త పుంతలు తొక్కించిన ఘనత బాబునాయుడికే దక్కుతుందన్నారు. ఆయన నేతృత్వంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేసేలా భగవంతుడు ఆశ్వీరదించాలని వారు ఆకాంక్షించారు.
 
ఈ కార్యక్రమంలో పశుగణాభివృద్ధి సంస్థ జిల్లా చైర్మన్‌ కొత్త నాగేంద్రకుమార్‌, లిడ్‌క్యాప్‌ డైరెక్టర్‌ సొంగా రవీంద్ర, రాష్ట్ర పౌరసరఫరాల డైరెక్టర్‌ లుక్కా సాయిరామ్‌ గౌడ్‌, మాజీ ఉడా చైర్మన్‌ తూమాటి ప్రేమ్‌నాథ్‌, నాయకులు కాట్రగడ్డ బాబు, ఆళ్ల గోపాలకృష్ణ, యెర్నేని వేదవ్యాస్‌, జాస్తి సాంబశివరావు, కందిమళ్ల ఆంజనేయులు, కారే జోసెఫ్‌, బొప్పన రవికృష్ణ, పూల రామచంద్రరావు, నాకా వెంకటేశ్వరరావు గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. పభుత్వ విప్‌, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కేశినేని భవన్‌లో భారీ కేక్‌ కోసి సంబరాలు జరిపారు. విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలోని 42వ డివిజన్‌లో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గన్నే ప్రసాద్‌ (అన్నా) ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి మజ్జిగ పంపిణీ చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఎన్టీఆర్‌ సర్కిల్‌లో రిక్షా, ఆటో యూనియన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని గన్నే ప్రసాద్‌, స్థానిక కార్పొరేటర్‌ జాస్తి సాంబశివరావు ప్రారంభించారు. సీబీఎన్‌ ఆర్మీ ఆధ్వర్యంలో విజయవాడ పాత ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. నగరంలోని ఆయా ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.
 

కనకదుర్గమ్మ ఆశీస్సులతో..
భవానీపురం: యువతకు స్ఫూర్తినిచ్చేలా నూతనోత్సాహం, పట్టుదల, కృషితో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పనిచేస్తున్నారని నగర మేయర్‌ కోనేరు శ్రీధర్‌ అన్నారు. శనివారం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన నివాసానికి వెళ్లిన మేయర్‌ పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు కుటుంబానికి కనకదుర్గమ్మ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, ఆయురారోగ్యాలతో తులతూగాలని అమ్మవారిని కోరుకున్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *