చంద్రబాబు సమావేశానికి నలుగురు కీలక నేతలు గైర్హాజరు


కర్నూలు: జిల్లాలోని ఓర్వకల్లు హరితా హోటల్‌లో టీడీపీ అభ్యర్థులతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. జిల్లాలో ఎన్నికల సరళి, ఈవీఎంల మొరాయింపు, మహిళల ఓటింగ్ టీడీపీకి ఏమేరకు అనుకూలించింది..? తదితర అంశాలపై ప్రతి అభ్యర్థిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో 120 స్ధానాల్లో టీడీపీ విజయ కేతనం ఎగురవేస్తుందని ఇందులో డౌట్ లేదన్నారు. మళ్లీ మనమే గవర్నమెంట్ ఫామ్ చేస్తామని చంద్రబాబు అభ్యర్థులకు తెలిపారు. వైసీపీ పుకార్లు ఫలితాల రోజు వరకేనని ఆ తర్వాత వాళ్లు మాట్లాడటానికి ఏమీ ఉండదని చంద్రబాబు చెప్పారు.
 
నలుగురు కీలక నేతలు గైర్హాజరు..
వ్యక్తిగత కారణాల వల్ల భూమ అఖిల ప్రియ, కేఈ శ్యామ్ బాబు, టీజీ భరత్, బుడ్డా రాజశేఖరరెడ్డి సీఎం సమావేశానికి హాజరు కాలేదు. జిల్లా టీడీపీ నేతలతో కలిసి చంద్రబాబు ఓర్వకల్లు రాతివనాలను సందర్శించారు. అనంతరం కేఈ క్రిష్ణమూర్తి, కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డితో చంద్రబాబు ప్రత్యేకంగా మాట్లాడారు. జిల్లాలో టీడీపీ అభ్యర్థుల గెలుపు కోసం బాధ్యతగా పని చేశారని చంద్రబాబు వారిని అభినందించారు. అనంతరం ప్రత్యేక హెలికాప్టర్‌లో ఎన్నికల ప్రచారం నిమిత్తం చంద్రబాబు రాయచూర్‌కు బయలుదేరారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *