చంద్రబాబు సవ్యసాచి: బుద్దా


విజయవాడ (విద్యాధరపురం), మే 5: భారతంలో అర్జునుడు సవ్యసాచి అయితే, దేశంలో మోదీ, జగన్‌ కుట్రలను ఏకకాలంలో తిప్పికొట్టిన కలియుగ సవ్యసాచి చంద్రబాబు అని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. ఆదివారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. ప్రజలకు మేలు చేయాలనే తపన ఉన్న ఏకైక నాయకుడు చంద్రబాబు అని కొనియాడారు. తుపాను ప్రజలు ఇబ్బందులు పడకూడదని చంద్రబాబు పని చేస్తుంటే, జగన్‌ విహారయాత్రలు చేస్తున్నారని విమర్శించారు. జగన్‌ తీరు చూసి వైసీపీకి ఓటు వేసిన వారు కూడా ఎందుకు వేశామా అని ఇప్పుడు బాధపడుతున్నారన్నారు. ఏపీలో తాగునీరు, కరెంటు కష్టాలపై సమీక్షలు చేయకుండా సీఎంను అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. ప్రధాని మోదీ అసమర్థ పాలన, నియంతృత్వ ధోరణిని ప్రజలకు చాటిచెప్పిన నాయకుడు చంద్రబాబు అని చెప్పారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *