చచ్చినా బీజేపీకి మేలు చేసే నిర్ణయం తీసుకోను : ప్రియాంక గాంధీన్యూఢిల్లీ : యూపీలో కాంగ్రెస్, మహా కూటమి విడిగా పోటీ చేయడం వల్ల బీజేపీ వ్యతిరేక ఓటు చీలి, తద్వారా బీజేపీకే లాభం చేకూర్చేలా కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని మాయావతితో సహా పలువురు నేతలు దుమ్మెత్తి పోసిన విషయం తెలిసిందే. అయితే ఈ వివాదంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఘాటుగా స్పందించారు. చావనైనా చస్తా కానీ, బీజేపీకి లాభం చేకూర్చే ప్రసక్తే లేదని ప్రియాంక తేల్చిచెప్పారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని, ఈ ఎన్నికలు దేశానికే అత్యంత ప్రతిష్ఠాత్మకమైనవని ఆమె తెలిపారు. బరిలో నిలిచిన కాంగ్రెస్ నేతలందరూ గట్టివారేనని, బీజేపీని సమర్థవంతంగా ఓడిస్తారని ప్రియాంక గాంధీ ధీమా వ్యక్తం చేశారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *