చాందినీచౌక్‌లో మొరాయిస్తున్న ఈవీఎంలు… అసహనంలో ఓటర్లు


న్యూఢిల్లీ: లోక్‌సభ ఆరవ దశ ఎన్నికలలో భాగంగా దేశరాజధాని ఢిల్లీలో పోలింగ్ ప్రారంభమైంది. ఇక్కడ 18 మంది మహిళలతో పాటు మొత్తం 164 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో దిగి, తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఢిల్లీలో బీజేపీ, ఆప్, కాంగ్రెస్‌ల మధ్య ముక్కోణపు పోరు జరగనుంది. ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరపున పోటీచేస్తున్న శీలా దీక్షిత్, విజేంద్ర సింగ్, బీజేపీ నుంచి బరిలో దిగిన కేంద్ర మంత్రి హర్షవర్ధన్, ఆప్ నుంచి బరిలోకి దిగిన ఆతిషీ‌లపై అందరి దృష్టి నిలిచింది. ఇదిలావుండగా ఢిల్లీలోని చాందినీ‌చౌక్ లోక్‌సభ సీటు పరిధిలోని సివిల్‌లైన్స్‌లో గల సెయింట్ జేవియర్స్ స్కూలులోని పోలింగ్ బూత్‌నంబర్ 124లో పోలింగ్ ప్రారంభమైంది. అయితే ఈవీఎం మొరాయించడంతో, దాదాపు గంటసేపు గడిచినా పోలింగ్ ప్రారంభం కాలేదు. దీంతో ఓటర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ లోక్‌సభ సీటు నుంచి బీజేపీ తరపున బరిలోకి దిగిన కేంద్రమంత్రి హర్షవర్థన్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. తరువాత ప్రజలంతా తమ ఓటు హక్కు వినియోగించుకుని, అత్యధికశాతం పోలింగ్ నమోదుకు తోడ్పడాలని పిలుపునిచ్చారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *