చిట్టి గుండెకు పెద్ద చికిత్స!


  •  నెలలు నిండని చిన్నారికి క్లిష్టమైన ఆపరేషన్‌
  •  విజయవాడ ఆంధ్రా ఆస్పత్రి వైద్యుల ఘనత
విజయవాడ, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): నవమాసాలు నిండకుండా.. ఆరో నెలలోనే పుట్టిన బిడ్డకు క్లిష్టమైన గుండె శస్త్రచికిత్స నిర్వహించి ప్రాణాలు నిలబెట్టారు విజయవాడ ఆంధ్రా ఆస్పత్రి వైద్యులు. విజయవాడకు చెందిన ప్రసాద్‌, అంబిక దంపతులకు ఈ ఏడాది జనవరి 18న పాప పుట్టింది. 700 గ్రాముల బరువుతో 25 వారాలకే పుట్టిన పాపకు ఊపిరితిత్తుల ఎదుగుదల సరిగా లేదు. దానివల్ల ‘పేటెంట్‌ డక్టస్‌ ఆర్టిరియోసస్‌’ అనే గుండె జబ్బుతో బాధపడుతున్నట్టు గుర్తించిన వైద్యులు ఆ చిన్నారిని వెంటిలేటర్‌పై ఉంచారు. ఎన్‌ఐసీయూలోనే ఆపరేషన్‌ నిర్వహించి పాప ప్రాణాలు కాపాడారు. ప్రతిక్షణం వైద్యుల పర్యవేక్షణలో ఆ చిన్నారికి అవసరమైన వైద్యసేవలందించారు. ఆరోగ్యం బాగుందని నిర్ధారించుకున్నాక శనివారం తల్లిదండ్రులకు అప్పగించారు. కాగా పాపకు విజయవంతంగా ఆపరేషన్‌ చేసిన డాక్టర్లు దిలీప్‌ (కార్డియాక్‌ సర్జన్‌), విక్రమ్‌ (పిల్లల గుండెజబ్బుల నిపుణుడు), కృష్ణప్రసాద్‌ (పిల్లల ఇంటెన్సివ్‌ కేర్‌ స్పెషలిస్ట్‌), భూజాత (నవజాత శిశువుల వైద్య నిపుణురాలు)తో కూడిన వైద్యబృందాన్ని ఆంధ్రా ఆస్పత్రి అధినేత డాక్టర్‌ పి.వి.రామారావు అభినందించారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *