చైనాలో భారీ బుద్ధ విగ్రహం


బీజింగ్‌, ఏప్రిల్‌ 27: ప్రపంచంలోనే అతి పెద్ద బుద్ధ విగ్రహాన్ని మరమ్మతుల అనంతరం చైనా ప్రజల సందర్శనకు తిరిగి అందుబాటులోకి తీసుకొచ్చింది. చైనాలోని సిచువాన్‌ ప్రాంతంలో లేషన్‌ కొండల మధ్యలో ఉన్న ఈ భారీ బుద్ధ విగ్రహం ఎత్తు 71 మీటర్లు. 713వ సంవత్సరంలో టాంగ్‌ రాజవంశస్థులు ఈ విగ్రహాన్ని చెక్కించారు. విగ్రహం ఛాతీ, ఉదర భాగంలో పగుళ్లు రావడాన్ని గుర్తించిన చైనా గత ఏడాది అక్టోబరులో విగ్రహ సందర్శనను నిలివేసింది. ఆరు నెలలపాటు అధిక సాంద్రత నిరోధక పద్ధతులను వినియోగించి మరమ్మతులు పూర్తి చేసింది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *