జంక్షన్‌ క్లోజ్‌!


  • పటమట లంకవాసులకు బెంజ్‌ కష్టం
  • ఫ్లైవోవర్‌తో ఎస్‌వీఎస్‌ జంక్షన్‌ దారి మూసివేత
  • అర లక్ష మందికిపైగా పొంచి ఉన్న ట్రాఫిక్‌ నరకం
  • సబ్‌వే నిర్మాణం చేపట్టాలన్న వినతులు బుట్టదాఖలు
  • మొండిగా వ్యవహరిస్తున్న నేషనల్‌ హైవే అధికారులు
ఆంధ్రజ్యోతి విజయవాడ: నగరవాసుల ట్రాఫిక్‌ కష్టాలను తీర్చేం దుకు ప్రారంభించిన బెంజిసర్కిల్‌ ఫ్లైవోవర్‌ పడమటలంక వాసులకు చుక్కలు చూపించబోతోంది. నగరం నడిబొడ్డున 16వ నంబరు జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌-16)పై నిర్మిస్తున్న బెంజ్‌ ఫ్లైవోవర్‌ నిర్మాణ పనుల్లో అధికారుల ఉదాసీనత వీరికి ట్రాఫిక్‌ కష్టాలను మరింత పెంచనుంది.
 
కృష్ణలంక స్ర్కూబ్రిడ్జి నుంచి రమేష్‌ హాస్పిటల్‌ జంక్షన్‌ దాటే వరకు ఉన్న జంక్షన్లలో ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించి, నగరవాసులకు ప్రయాణాన్ని సుఖమయం చేయడమే బెంజి సర్కిల్‌ ఫ్లైవోవర్‌ ప్రధాన లక్ష్యం. కానీ ఈ మౌలిక సమస్యకు పరి ష్కారాన్ని విస్మరించి, సమస్యను మరింత పెంచేలా ఎన్‌హెచ్‌ అధికారులు వ్యవహ రిస్తున్నారు. జంక్షన్లను మూసివేసేలా వంతెనను డిజైన్‌ చేయడంతో సమస్య పరిష్కారం కాకపోగా మరింత పెరిగే సూచనలు కన్పిస్తున్నాయి.
 
స్ర్కూ బిడ్జికి కాస్త ముందు బెంజి ఫ్లైవోవర్‌ ముగుస్తుంది. సరిగ్గా దీనికి కాస్త ముందు ఎస్‌వీఎస్‌ జంక్షన్‌ ఉంది. ఈ జంక్షన్‌ను యథాతథంగా ఉంచుతూ సబ్‌వే నిర్మాణం చేపడితే ఎలాంటి సమస్య తలెత్తేది కాదు. కానీ ఈ జంక్షన్‌ను మూసివేస్తూ పూర్తిగా అప్రోచ్‌ వాల్‌ నిర్మించాలని ప్రతిపాదించటం ఇప్పుడు సమస్యలకు కారణమవుతోంది. ఇదే జరిగితే.. బెంజ్‌ ఫ్లైవోవర్‌ తూర్పు భాగాన బందరు రోడ్డు, బందరు కాల్వల మధ్యన ఉన్న పటమట లంక, పటమటలో కొంత భాగం, యనమలకుదురు ప్రాంతాలకు ఉన్న ఏకైక ప్రధానదారి మూసుకు పోతుంది. ఫలితంగా సుమారు అర లక్ష మంది ప్రజలు తీవ్ర ట్రాఫిక్‌ ఇబ్బందులకు గురి కావడమే కాకుండా, జాతీయ రహదారిపైనా దీని ప్రభావం పడుతుంది. అలైన్‌మెంట్‌ ప్రకారం ఎస్‌వీఎస్‌ జంక్షన్‌ దగ్గర దారి ఇవ్వలేమని ఎన్‌హెచ్‌ చెబుతోంది. ఆర్థికపరమైన కారణాలతోనే ఎన్‌హెచ్‌ అధికారులు ఆ విధంగా వాదిస్తున్నారని సమచారం. ఏడాది కాలంగా ఈ సమస్యపై స్థానికులు పోరా డుతున్నా ఎన్‌హెచ్‌ అధికారులు స్పందిం చకపోవడం.. ఫ్లైవోర్‌ ముగింపు దశకు చేరుకుంటుండటంతో స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాలని నిర్ణయించి, ఆమేరకు కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు.
 
ఆందోళనబాటలో స్థానికులు…
తాము ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా ఎన్‌హెచ్‌ అధికారులు స్పందించకపోవ డంతో చివరిగా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాలని స్థానికులు భావిస్తున్నారు. ఎస్‌వీఎస్‌ జంక్షన్‌ వద్ద సబ్‌వే నిర్మిం చాలన్న ప్రతిపాదనతో స్థానికుల నుంచి పెద్ద ఎత్తున సంతకాల సేకరణ చేపట్టారు. సుమారు మూడు వేల మంది సంతకా లతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా అధికార యంత్రాంగానికి, ఎన్‌హెచ్‌ అధికారులకు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉండగా.. ఈ సమస్యపై రెండు రోజుల క్రితం కృష్ణా కలెక్టర్‌ ఎండీ ఇంతియాజ్‌ అధ్యక్షతన జరిగిన రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో కూడా చర్చ జరిగింది.
 
ఎన్‌హెచ్‌ ప్రతిపాదించిన మధ్యే మార్గం ఇలా..
పటమటలంక, దర్శిపేట, రామలిం గేశ్వరనగర్‌, పటమట ప్రజలకు ఎస్‌వీఎస్‌ జంక్షన్‌ మూసుకుపోవడంతో ప్రత్యామ్నా యంగా దానికి సమీపంలో ఉన్న ఏ 1 , పీ 1 పిల్లర్ల దగ్గర రాకపోకలకు వీలు కల్పిస్తామని ఎన్‌హెచ్‌ ప్రతిపాదిస్తోంది. అయితే దీనికి స్థానికులు అంగీకరించడం లేదు. పటమటలంక నుంచి రావడానికి ఎలాంటి ఇబ్బంది లేకపోయినా తిరిగి వెళ్లాలంటే వారంతా బెంజి సర్కిల్‌ వరకు వచ్చి వెళ్లాల్సి ఉంటుంది. ఫలితంగా బెంజి సర్కిల్‌ వద్ద ట్రాఫిక్‌ ఒత్తిడి మరింత పెరుగుతుంది. అదే సమయంలో పటమ టలంక నుంచి బయటకు వచ్చేవారు తిరిగి ఎస్‌వీఎస్‌ జంక్షన్‌ వద్ద మలుపు తిరగాల్సి ఉంటుంది, ఫలితంగా ఆ జంక్షన్‌ లోనూ ట్రాఫిక్‌ ఒత్తిడి ఎక్కువవుతుంది. ఈ కారణాల రీత్యా జిల్లా అధికారయం త్రాంగం సైతం ఎన్‌హెచ్‌ ప్రత్యామ్నాయ ప్రతిపాదనను వ్యతిరేకిస్తోంది.
 
అలైన్‌మెంట్‌ మార్పుతోనే అసలు చిక్కు
పదహారో నంబర్‌ జాతీయ రహదారిపై నిర్మించే బెంజ్‌ ఫ్లైవోవర్‌ మొదటి ప్రతి పాదనకు సంబంధించిన అలైన్‌మెంట్‌లో ఎస్‌వీఎస్‌ జంక్షన్‌, బెంజిసర్కిల్‌, నిర్మలా జంక్షన్‌ దగ్గర దారి (వెంట్‌) ఇవ్వాలన్న ప్రతిపాదన ఉంది. రెండో ప్రతిపాదన (వంతెన పొడిగింపునకు సంబంధించిన ప్రతిపాదన)లో మాత్రం అలైన్‌మెంట్‌ మారిపోయింది. ఈ మారిన అలైన్‌ మెంట్‌ను ఎన్‌హెచ్‌ అధికారులు గోప్యంగా ఉంచి నిర్మాణ పనులు ప్రారంభించారు. ఇప్పుడు ఇదే సమస్యలకు కారణమవు తోంది. మారిన అలైన్‌మెంట్‌ ప్రకారం ఎస్‌వీఎస్‌ జంక్షన్‌ దిగువున ఎలాంటి దారి(వెంట్‌) అనేది లేకుండా అప్రోచ్‌ రహదారి వెళ్లిపోతుంది. ఆలస్యంగా ఈ విషయం తెలుసుకున్న స్థానిక ప్రజలు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావును, ఎంపీ కేశినేని నానిని కలిశారు. వారు ఎన్‌హెచ్‌ అధికారులతో మాట్లాడినా ప్రయోజనం లేకుండా పోయింది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *