జగన్‌ కేసులో ముద్దాయిగా ఉన్నా ఎల్వీకి ఇంకా బుద్ధి రాలేదు


  • 3 వారాల సంబరానికి ఇంత ఓవరాక్షనా?
  • తిరుమలేశుడికి విజయసాయి, ఐవైఆర్‌ ద్రోహం
  • బ్రాహ్మణ చైతన్య వేదిక ఆగ్రహం
గుంటూరు, ఏప్రిల్‌ 26: వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ నిందితుడిగా ఉన్న ఎమార్‌ ప్రాపర్టీస్‌ కేసులో ఎల్వీ సుబ్రమణ్యం ఏ-11 ముద్దాయిగా ఉన్నారని.. అయినా ఆయనకింకా బుద్ధి రాలేదని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర కో కన్వీనర్‌ సిరిపురపు శ్రీధర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం గుంటూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఎల్వీ కేవలం ప్రభుత్వ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి మాత్రమేనని గుర్తించుకోవాలి. మూడు వారాల సంబరానికి ఓవరాక్షన్‌ చేస్తున్నారు. ఎల్వీ అవినీతి కేసులో నిందితుడిగా ఉన్నప్పుడు ఆయనపై ఐవైఆర్‌ కృష్ణారావు, మిగిలిన విశ్రాంత ఐఎఎస్‌లు ఎందుకు సానుభూతి చూపలేదు? ఇప్పుడు ఆయనపై లేనిపోని ప్రేమ చూపుతూ రాష్ట్ర రాజకీయాల్లో ఆయనను పావుగా వాడుకుంటూ ఆయన భుజంపై తుపాకీ పెట్టి చంద్రబాబును కాల్చాలని ఒత్తిడి చేస్తున్నారు’ అని అన్నారు.
 
కోట్లాది మంది భక్తులు విశ్వసించే కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వరుడిని అప్రతిష్ఠ పాల్జేసే విధంగా రెండేళ్లుగా బీజేపీ, వైసీపీ సంయుక్తంగా కుట్ర రాజకీయాలు చేస్తున్నాయని శ్రీధర్‌ మండిపడ్డారు. మాజీ సీఎస్‌ ఐవైఆర్‌ కృష్ణారావు, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పథకం ప్రకారం టీటీడీ ప్రతిష్ఠను భ్రష్టు పట్టిస్తున్నారన్నారు. వైఎస్‌ సీఏంగా వైఎస్‌ ఉన్న సమయంలో తన సొంత అల్లుడి రిసార్డ్స్‌ కోసం తిరుమలకు ఏడుకొండలు అనవసరమని, రెండు కొండలు ఉంటే చాలని జీవో ఇచ్చినప్పుడు ఐవైఆర్‌, అప్పటి టీటీడీ బోర్డు సభ్యుడిగా ఉన్న విజయసాయిరెడ్డి ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. రెండు కొండలు చాలన్న వైఎస్‌కు ఏ గతి పట్టిందో.. శ్రీవారిని స్వార్థ రాజకీయాలకు ఉపయోగించుకోవాలనుకునే వారికీ అదే గతి పడుతుందని శ్రీధర్‌ హెచ్చరించారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *