జనంపై దుమ్ముకొట్టి..!


  • బ్రహ్మయ్యలింగం చెరువు తవ్వకాలు కొందరికి లాభం.. ప్రజలకు శాపం
  • కాలుష్య కోరల్లో గన్నవరం మండల ప్రజలు
  • ప్రజారోగ్య చర్యలు లేకుండా మట్టి తవ్వకానికి అడ్డగోలు టెండర్లు
  • వందలాది లారీలతో ఊళ్ల నిండా దుమ్ము
చెరువులో కాలుష్యం.. క్వారీల్లో కాలుష్యం… గాలిలో కాలుష్యం.. గన్నవరం మండలంలోని పలు గ్రామాలను నలువైపుల నుంచి కాలుష్యం కమ్మేస్తోంది. సువిశాలమైన బ్రహ్మయ్య లింగం చెరువు నుంచి వేలాది లారీల్లో తరలిపోతున్న మట్టి మండలంలోని పలు గ్రామాల్లో ‘దుమ్ము’ రేపుతోంది. ఈ కాలుష్యంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇరిగేషన్‌ అధికారులకు ఆదాయంపై ఉన్న శ్రద్ధ ప్రజారోగ్యంపై లేదు. ‘ఈ మట్టి తవ్వకం వద్దు’ అంటూ ఆగ్రహంతో ప్రజలు లారీలను నిలిపివేస్తే పోలీసులు ప్రతాపం చూపుతారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం కళ్లు తెరవడం లేదు. గతంలో తొమ్మిది లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి తవ్వకానికి అనుమతినిచ్చారు. అరదశాబ్ద కాలంగా దశలవారీగా ఈ తవ్వకం సాగింది. ఇప్పుడు ఏకంగా 54.55 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టిని తవ్వటానికి టెండర్లు పిలిచారు. రూ.16 కోట్ల వ్యయంతో ఒక ప్రైవేటు సంస్థ ఈ టెండర్లను దక్కించుకుంది. ‘ఈ దుమ్ములో ఇంకా ఎన్నేళ్లు మేము రోగాలతో బతకాలి?’ అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 
విజయవాడ/గన్నవరం (ఆంధ్ర జ్యోతి): పన్నెండు వందల ఎకరాల విస్తీర్ణం కలిగిన అతిపెద్ద బ్రహ్మయ్యలింగం చెరువు మట్టి తవ్వకం విషయంలో ఇరిగేషన్‌ శాఖ అధికారులు టెండర్లు మీద చూపిన ప్రేమ ప్రజల మీద కాస్త కూడా చూపలేదు. భారీ చెరువు మట్టి తవ్వకం విషయంలో గతంలో దుమ్ము, ధూళి మట్టి కాలుష్యంపై ప్రజాం దోళనలు మిన్నంటాయి. రూ.16 కోట్ల వ్య యంతో 54.55 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి తవ్వకం (దాదాపుగా మూడొంతులు చెరువు) టెండర్లు పిలిచే సందర్భంలో ప్రజారోగ్యం పట్ల దృష్టి సారించలేదు. కాలుష్యం మా కొద్దు బాబోయ్‌ అంటూ రోజుకో గ్రామంలో ప్రజలు లారీలు నిలుపుదల చేయాల్సి వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకోకపోతే తప్ప వేలాది మంది ప్రజలు కాలుష్య సమస్య పరిష్కారం కాదు.
 
ఇరిగేషన్‌ శాఖ నిర్లక్ష్యం
జీవనది ‘కృష్ణా’ కాలుష్య కాసారంగా మా రితే దానిని పరిరక్షించటానికి ఒకవైపు జిల్లా యంత్రాంగం యుద్ధమే చేస్తోంది. కానీ, మరో వైపు ప్రభుత్వ శాఖలు ప్రజారోగ్యానికి తూట్లు పొడుస్తున్నాయి. ఇరిగేషన్‌ శాఖ నిర్లక్ష్యం కార ణంగా బ్రహ్మయ్యలింగం చెరువు మట్టి తవ్వ కం వేలాదిమంది ప్రజలను కాలుష్య కోరల్లో చిక్కుకునేలా చేసింది. బ్రహ్మయ్యలింగం చెరువు మట్టి తవ్వకం ఇప్పటిది కాదు. పన్నెం డు వందల ఎకరాల సువిశాల చెరువు మట్టి తవ్వకం గత అర దశాబ్దకాలంగా దశల వారీగా కొనసాగిస్తున్నారు. మూడేళ్ల కిందట 9 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి తవ్వకం సందర్భంగా ఇరిగేషన్‌ శాఖ అధికారులు వ్యవహరించిన వైఖరి కారణంగా వేలాది మంది ప్రజలు దుమ్ము, ధూళి వంటి కాలుష్య కూపంలో చిక్కుకుపోయారు. తోట పల్లి, గొల్లనపల్లి, బీబీగూడెం, గోపవరపు గూడెం, చిక్కవరం, గన్నవరం పట్టణం, కేసరపల్లి ఇంకా ఎగువ గ్రామాలలోని వేలాదిమంది ప్రజలు భయంకరమైన దుమ్ము, ధూళి కాలుష్యం కోరల్లో చిక్కుకుని అనారోగ్య పరిస్థితులు తెచ్చుకున్నారు.
 
వేలల్లో లారీలు
ఆయా గ్రామాల మీదుగా రోజూ 1700 నుంచి 2000 వేలకు పైగా లారీలు నిరం తరం తిరుగుతున్నాయి. ఇవి రోడ్ల మీద పరు గులు పెడుతుంటే కంపనాలు పుడు తున్నాయి. దుమ్ము, ధూళితో గ్రామాలు ఎర్ర బారుతున్నాయి. చెట్ల మీద, ఇళ్ల మీద, ఆఖ రుకు ఇంట్లోని మంచాల మీద కూడా దుమ్ము పేరుకుపోతోంది. రోడ్ల మీద ప్రయాణించే వారి పరిస్థితి నరకం. దీంతో విసిగి వేసారిన గ్రామ ప్రజలు లారీలను నిలుపుదల చేసి ప్రజారోగ్య చర్యలు చేపట్టాలని ఆందోళన చేస్తున్నారు.
 
ఉద్దేశం మంచిదే అయినా..
బ్రహ్మయ్యలింగం చెరువు మట్టి తవ్వకం ఉద్దేశం మంచిదే అయినా.. ప్రజారోగ్యాన్ని దృ ష్టిలో పెట్టుకోకుండా మట్టి తవ్వకానికి ఇరి గేషన్‌ టెండర్లు పిలవటం వల్ల పర్యావరణం దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. పట్టిసీమ నుం చి గోదావరి జలాలను బ్రహ్మయ్యలింగం చె రువులోకి ఎత్తిపోయాలన్న మహాసంకల్పం గ తంలో ప్రభుత్వం చేసింది. అందులో భాగం గా ఈ ప్రాజెక్టు పనులు మొదలయ్యాయి. చిక్కవరం దగ్గర పోలవరం కుడికాల్వ వెం బడి సంప్‌ ఇతర నిర్మాణ పనులు జరు తున్నాయి. మరోవైపు బ్రహ్మయ్యలింగం చెరు వు పూడిక తొలగింపు పనులు వేర్వేరుగా చేప ట్టారు. ఇరిగేషన్‌ పిలిచిన టెండర్ల ప్రకారం పూడిక తీస్తే.. ఎక్కువ నీటిని నిల్వ చేయ టానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రాజెక్టు గురించి తెలిసి సమీప గ్రామాల ప్రజలు రాజ కీయాలకతీతంగా సహకారం అందిస్తున్నా రు. తమను మాత్రం కాలుష్యం కోరల్లో చి క్కుకోకుండా చూడాలనే వారు కోరుతున్నారు.
 
గతం కంటే భారీగా..
ప్రజాందోళనలు, అక్కడి పరిస్థితుల గురించి ఇరిగేషన్‌ శాఖకు తెలిసి కూడా తాజాగా పిలిచిన మట్టి తవ్వకానికి అడ్డ గోలుగా టెండర్లు పిలిచారు. గతంలో కంటే భారీగా దాదాపుగా మూడొంతుల చెరువు మట్టి తోలకానికి సంబంధించి 54.55 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి తవ్వకానికి టెండర్లు పిలిచారు. రూ.16 కోట్ల వ్యయంతో ఒక ప్రైవేటు సంస్థ టెండర్లను దక్కించుకుంది. టెండర్లు పిలిచే ముందు పర్యావరణం దెబ్బతినకుండా కాంట్రాక్టు సంస్థ తీసుకోవాల్సిన చర్యలపై ఎలాంటి నిబం ధనలను పొందు పరచకుండా అడ్డగోలుగా టెండర్లు పిలవటం ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది. మట్టి ఉచితమైనప్పటికీ తవ్వినందుకు క్యూబిక్‌ మీటర్‌కు ఇంత అని ఇరిగేషన్‌ శాఖ చెల్లించేలా టెండర్లు పిలిచేశారు. టెండర్‌లో ఈ అంశాలు తప్పితే ప్రజారోగ్యానికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై నామమాత్రంగా స్పందించలేదు. గతం కంటే ఆరు రెట్లు అధికంగా మట్టి తవ్వకానికి టెండర్లు పిలవటం వల్ల రికార్డు స్థాయిలో లారీలు తిరుగుతున్నాయి.
 
పోలీసుల బెదిరింపులు
చెరువు మట్టి తవ్వకానికి సంబంధించి ప్రజలు ఆందోళన చేస్తే వారిని భయ భ్రాంతులను గురిచేయటానికి గన్నవరం పోలీసులు ముందుగా ప్రత్యక్షమౌతున్నారు. ఇలాంటి ఆందోళనలకు సంబంధించి రెవె న్యూ శాఖ, పంచాయతీరాజ్‌, మండల పరిషత్‌ అధికారులు స్పందించాలి. దీనికి విరుద్ధంగా పోలీసులు వచ్చి హడావిడి చేస్తున్నారు. ఎన్నికల కోడ్‌ పేరుతో అధికారులు దూరంగా ఉంటున్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *