జనసేన తరఫునా బెట్టింగ్‌!


  • నాలుగు జిల్లాల్లో కొన్ని సీట్లపై గురి
  • పవన్‌ రెండు చోట్లా గెలుస్తారని పందెం
  • జోరుగా ఆ పార్టీ అభిమానుల పందేలు
అమరావతి, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో జనసేన పార్టీ తరఫున కూడా పందేలు కాస్తున్నారు. పార్టీ అధికారంలోకి వస్తుందా.. రాదా.. అన్నది కాకుండా.. సీట్ల వారీగా ఈ పందాలు నడుస్తున్నాయి. కొన్నిచోట్ల రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం తమ పార్టీ ఎమ్మెల్యేల మద్దతుతోనే ఏర్పడుతుందని కూడా జనసేన తరఫున బెట్టింగులు కాస్తున్నారు. కృష్ణా, ఉభయ గోదావరి, విశాఖ జిల్లాల్లోని కొన్ని స్థానాలపై ఆ పార్టీ అభిమానులు పందేలు వేస్తున్నారు. ముఖ్యంగా పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం, తూర్పుగోదావరి జిల్లా రాజోలు, కృష్ణా జిల్లా పెడన, అవనిగడ్డ, విజయవాడ(తూర్పు) తదితర నియోజకవర్గాల్లో తమ పార్టీయే గెలుస్తుందని.. పవన్‌ కల్యాణ్‌ స్వయంగా పోటీచేసిన భీమవరం, గాజువాక స్థానాల్లోనూ తమదే విజయమని జోరుగా పందేలు కాస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చినా.. అది జనసేన మద్దతుతోనేనని బెట్టింగుల జోరు సాగుతోంది.
  
అనూహ్య అంచనాలు.. పోలింగ్‌ ముగిశాక కొన్నిరోజులు ఉన్న అంచనాలకు.. ఇప్పటికీ జనసేన నేతల్లో అంచనాలు అనూహ్యంగా మారాయి. తొలుత పవన్‌ పోటీచేసిన భీమవరం, గాజువాకల్లో ఏదో ఒక స్థానంలో గెలుస్తారని అభిమానులు భావించారు. ఇప్పుడు లెక్కలు వేసుకుని.. రెండు చోట్లా విజయం సాధిస్తామంటున్నారు. తమకు ఎన్ని సీటు వస్తాయో.. అధికారంలోకి వస్తామని కాకుండా.. గెలుస్తామని గట్టి విశ్వాసం ఉన్నచోట్ల సీట్లవారీగా ఆ పార్టీ అభిమానులు బెట్టింగులు కాస్తుండడం విశేషం.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *