జపాన్‌లో రెండుసార్లు భూ ప్రకంపనలు…సునామీ ప్రమాదం లేదు…


టోకియో : జపాన్ దేశంలో శుక్రవారం ఉదయం రెండుసార్లు భూమి కంపించడంతో ఇక్కడి ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. జపాన్ దేశంలోని మియాజాకి షీ ప్రాంతంలో శుక్రవారం ఉదయం భూకంపం సంభవించింది. మొదటి భూప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.6 అని యునైటెడ్ స్టేట్స్ జియాలాజికల్ సర్వే వెల్లడించింది. 35కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని శాస్త్రవేత్తలు చెప్పారు. ఇదేప్రాంతంలో రెండో సారి భూమి కంపించిందని, అది రిక్టర్ స్కేలుపై 6.3 గా నమోదైంది. మియాజాకి షీ పట్టణానికి 37 కిలోమీటర్ల దూరంలో వచ్చిన భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని జపాన్ దేశ అధికారులు చెప్పారు. ఈ భూకంపాల వల్ల ఎలాంటి సునామీ ముప్పు లేదని అధికారులు వివరించారు.2011 లో వచ్చిన భూకంపం వల్ల 15వేలమంది మరణించారు. తరచూ భూకంపాలు వచ్చే జపాన్ దేశంలో మళ్లీ శుక్రవారం రెండు సార్లు భూమి కంపించడంతో ఇక్కడి ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *