జమ్మలమడుగులో రెచ్చిపోయిన ఇసుక మాఫియా


కడప: జమ్మలమడుగులో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. జమ్మలమడుగు శివారులో… ఇసుక అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో సంఘటనా ప్రదేశానికి చేరుకున్న పోలీసులు.. ఇసుక అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లను పట్టుకున్నారు. దీంతో ఇసుక మాఫియా ముఠా పోలీసులపైకి ఎదురుదాడికి దిగింది. ఈ ఘటనలో కానిస్టేబుల్‌ రామాంజనేయులుకు గాయాలయ్యాయి. ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేప్టటారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *