జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్…ఇద్దరు మిలిటెంట్లు హతం


శ్రీనగర్ : జమ్మూకశ్మీర్ రాష్ట్రంలోని షోపియాన్ జిల్లా ఇమాంసాహిబ్ పట్టణంలోని అద్కర ప్రాంతంలో భద్రతాబలగాలకు, మిలిటెంట్లకు మధ్య శుక్రవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మిలిటెంట్లు హతమయ్యారు. షోపియాన్ జిల్లా ఇమాంసాహిబ్ పట్టణంలోని అద్కర ప్రాంతంలో మిలిటెంట్లు దాక్కున్నారని అందిన సమాచారం మేర భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి. అంతలో మిలిటెంట్లు జవాన్లపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ ఆర్మీ జవాన్ గాయపడటంతో అతన్ని శ్రీనగర్ లోని ఆర్మీ బేస్ ఆసుపత్రికి తరలించారు. కాల్పుల జరిపిన మిలిటెంట్ల కోసం జవాన్లు గాలిస్తుండగా వారు తారసపడ్డారు. వారు కాల్పులు జరపడంతో ప్రతిగా జవాన్లు ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు మిలిటెంట్లు మరణించారు. ఈ సందర్భంగా షోపియాన్ జిల్లాలో ఇంటర్ నెట్ సర్వీసును నిలిపివేశారు. మిలిటెంట్ల కోసం జవాన్ల గాలింపు కొనసాగుతోంది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *